సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ కేంద్రంగా గురువారం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా తొలిదశలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి యాత్రలు పూర్తయిన సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.
సభకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌భగేల్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు హాజరు కానున్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే ఈ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు టీపీసీసీ వర్గాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment