టాలీవుడ్ స్టార్స్ సినిమాల వేడుకల్లో తన మాటలతోనే అందరినీ కట్టిపేడుస్తుంది సుమ కనకాల. కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించిన ఆమె రాజీవ్‌ను పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. 48 ఏళ్ల వయసులో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా వ్యాఖ్యాతగా తనదైన టాలెంట్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారామే.. అలా ట్రెండ్‌లో ఉన్నప్పుడే తన కుమారుడిని సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రోషన్ కనకాల 'బబుల్‌గమ్' చిత్రంతో హీరోగా రాబోతున్నాడు. ఈ క్రమంలో సుమ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
సమాజంలో చాలామంది మహిళలు తన భర్త చనిపోయాక ఎలాగైనా పిల్లలను పోషించుకోవాలని పని కోసం అనేకపాట్లు పడుతుంటారు. కొందరైతే ఇళ్లల్లో పనులు అయినా చేసేందుకు వెనుకాడరు. వారికి కనీసం బ్యాంక్, డబ్బులు దాచుకోవాలి, ఇన్సూరెన్స్‌లు.. ఇలాంటివి ఏమి తెలియవు. వారి భర్త ఇన్సూరెన్స్ చేసి ఉంటే అతను చనిపోయాక ఎంతో కొంత డబ్బులు వచ్చేవి. కానీ వాళ్లకు ఇవి తెలీదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు చుట్టూ ఉన్నవారిలో కొందరికైనా వీటి గురించి చెప్పాలని సుమ తెలిపింది.
(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్)
ఈ క్రమంలోనే తన కుటుంబం గురించి ఇలా చెప్పుకొచ్చింది. ' నాకు సంబంధించిన ఇన్సూరెన్స్‌ల విషయాల గురించి పిల్లలకు అంతా చెప్పాను. ఏదైనా కారణాలచేత హాఠాత్తుగా నేను చనిపోతే ఇన్యూరున్స్ ద్వారా ఎవరకి ఎంత వస్తుంది..? ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు అందుతుంది..? అనే విషయాలన్నీ నా పిల్లలను ఒకరోజు కూర్చోబెట్టి చెప్పాను. కానీ ఆ సమయంలో ఎందుకు మమ్మీ ఇలాంటి మాటలు మాట్లాడుతావు..? అని పిల్లలు తిరిగి ప్రశ్నించారు.
ఏదేమైనా మనం పిల్లలకు రియాల్టీ చెప్పాలి. ఈ క్షణం అనేది పక్కన పెడితే రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయాలు పిల్లలు ధైర్యంగా షేర్ చేయాల్సిన బాధ్యత మనమీదే ఉంది. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమ చెప్పింది నిజమే కదా అంటూ కొందరు వాటిని షేర్ కూడా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment