ఒక రోజు వస్తది..  | Bubblegum Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

ఒక రోజు వస్తది.. 

Dec 16 2023 3:30 AM | Updated on Dec 16 2023 3:30 AM

Bubblegum Movie Trailer Launch - Sakshi

రవికాంత్‌ పేరేపు, రోషన్, రాఘవేంద్ర రావు, మానస

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బబుల్‌గమ్‌’. మానసా చౌదరి హీరోయిన్‌గా నటించారు. రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో మహేశ్వరి  మూవీస్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో రానా, దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం రాఘవేంద్ర రావు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే సూపర్‌హిట్‌ కళ కనిపిస్తోంది. రోషన్, మానసల కెమిస్ట్రీ బాగుంది’’ అన్నారు. ‘‘రోషన్‌కు ప్రేక్షకుల అభిమానం దక్కాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రానా. ‘‘యూత్‌కు కావాల్సిన అంశాలు ఉన్న చిత్రమిది. రోషన్‌ యూనిక్‌గా ఉన్నాడు’’ అన్నారు అనిల్‌ రావిపూడి. ‘‘జీవితంలో ఏదో ఒక సందర్భంలో పగ తీర్చుకోవాలనిపిస్తుంటుంది.

ఈ సినిమాలో ఆది (రోషన్‌ పాత్ర పేరు) పాత్ర మాటల్లో చెప్పాలంటే ‘ఒక రోజు వస్తది.. ఆ రోజు చెవులు మూసుకున్నా వినపడతా.. కళ్లు మూసుకున్నా కనపడతా..’. రానా అన్న మా అందరికీ స్ఫూర్తి. రాఘవేంద్రరావు, అనిల్‌గార్లు ఈ వేడుకకు రావడం హ్యాపీగాగా ఉంది’’ అన్నారు రోషన్‌. ‘‘ట్రైలర్‌ కంటే సినిమా ఇరవై రెట్లు హై ఇస్తుంది’’ అన్నారు రవికాంత్‌ పేరేపు. ‘‘బబుల్‌గమ్‌’ ట్రైలర్‌ యూత్‌ఫుల్‌గా ఉంది. ఈ మధ్య ‘బేబీ’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత వివేక్‌ కూచిభొట్ల. సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement