
'బబుల్‌గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రైలర్‌తో మంచి ఇంపాక్ట్ చూపించాడు రోషన్ కనకాల. ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసినట్లు ట్రైలర్‌తో అర్థమౌతుంది. ప్రియురాలి వల్లే ప్రియుడికి అవమానం ఎదురైతే ఆ యువకుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో పర్‌ఫెక్ట్‌గా చూపించాడు రోషన్. అలాంటి సమయం ఎదురైతే జీవితంలో ఆ యువకుడు ఎలా సక్సెస్ అయ్యాడు..? అదే విధంగా ఆమెపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు..? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఉంది.
ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పాటలకు కూడా శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం యువతను మెప్పిస్తుంది. మొదటి సినిమాతోనే రోషన్ నటన సూపర్ అనిపించేలా ఉంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్‌ను చూసేయండి. డిసెంబర్ 29న బబుల్‌గమ్ విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment