షోరూమ్‌ ఓపెనింగ్‌లో జయమ్మ సందడి | Anchor Suma Inaugurates Haripriya Silks Showroom In Kothapet | Sakshi
Sakshi News home page

Anchor Suma: షోరూమ్‌ను ప్రారంభించిన యాంకర్‌ సుమ

Published Sun, Apr 17 2022 6:59 PM | Last Updated on Sun, Apr 17 2022 7:13 PM

Anchor Suma Inaugurates Haripriya Silks Showroom In Kothapet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాంకర్‌ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌ జనాలను ఆకట్టుకుంటోంది. తాజాగా జయమ్మ ఓ షోరూమ్‌ ఓపెనింగ్‌లో సందడి చేసింది. కొత్తపేటలో కాంచీపురం హరిప్రియ సిల్క్స్‌ను ప్రారంభించింది.

ఈ షోరూమ్‌లో బెనారస్ పట్టు, ఇక్కట్ పట్టు, ఉప్పాడ పట్టు, గద్వాల్ పట్టు, కుప్పాడం పట్టు, ఆరని పట్టు, కోల్కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాయిడరీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ అందుబాటులో ఉన్నాయి. కొత్తపేటలో తమ స్టోర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు జానపాటి శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులకు నాణ్యత గల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు.

చదవండి:  కేజీఎఫ్‌ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement