Showroom Opening
-
శారీ షో రూమ్ లో తళుక్కుమన్న ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ (ఫొటోలు)
-
యాంకర్ అనసూయకు బాహుబలి కాజాతో సత్కారం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): టీవీ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్‌కు శనివారం సురుచి పీఆర్వో వర్మ బాహుబలి కాజా అందించి సత్కరించారు. పెద్దాపురంలో షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు కాకినాడలోని ఒక హోటల్లో ఈ కాజా అందించినట్టు ఆయన వివరించారు. జిల్లాకు ప్రముఖులెవ్వరు వచ్చినా బాహుబలి కాజా అందివ్వడం సురుచి సంప్రదాయమన్నారు. కాగా స్టార్ యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది అనసూయ. రంగస్థలంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాల్లో నటించి సత్తాచాటింది. చివరగా దర్జా చిత్రంలో కనిపించింది. -
షోరూమ్ ఓపెనింగ్‌లో జయమ్మ సందడి
సాక్షి, హైదరాబాద్: యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ జనాలను ఆకట్టుకుంటోంది. తాజాగా జయమ్మ ఓ షోరూమ్ ఓపెనింగ్‌లో సందడి చేసింది. కొత్తపేటలో కాంచీపురం హరిప్రియ సిల్క్స్ను ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో బెనారస్ పట్టు, ఇక్కట్ పట్టు, ఉప్పాడ పట్టు, గద్వాల్ పట్టు, కుప్పాడం పట్టు, ఆరని పట్టు, కోల్‌కతా వర్క్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్, ఎంబ్రాయిడరీ సారీస్, ఫ్యాన్సీ సారీస్ అందుబాటులో ఉన్నాయి. కొత్తపేటలో తమ స్టోర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు జానపాటి శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులకు నాణ్యత గల వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు. చదవండి: కేజీఎఫ్ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్ -
విజయతీరానికి అవంతిక
అది విజయనగరం లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్... శనివారం ఉదయం సరిగ్గా పదిన్నర గంటలైంది. ఓ మెరుపు మెరిసినట్టు... పాలవెలుగు విరజిమ్మినట్టు... అచ్చమైన అందం నడిచొచ్చినట్టు... సినీనటి తమన్నా వచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన బిన్యూ స్మార్ట్ ఫోన్ షోరూం ప్రారంభించారు. ఆమెను చూడగానే అభిమానులు కేరింతలు కొట్టారు. విజయనగరం టౌన్: తమ అభిమాన హీరోయిన్ తమన్నాను చూసేందుకు అభిమాన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లోయర్ ట్యాంక్ బండ్రోడ్ జనసంద్రమైంది. శనివారం ఉదయం 10.30 గంటలకు సినీనటి తమన్నా హోటల్ మయూరా ఎదురుగా ఉన్న బి న్యూ స్మార్ట్ మొబైల్ స్టోర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా స్టోర్ ముందు ఏర్పాటు చేసిన స్టేజ్‌పైకి ఎక్కి అభిమానులను పలుకరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. లోపల జ్యోతి వెలిగించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉందన్నారు. బి న్యూ మొబైల్స్ స్టోర్‌లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మొబైల్స్ లభిస్తాయన్నారు. కొత్తగా కల్యాణ్‌రామ్‌తో సినిమా పూర్తయిందని, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ తమ 50వ షోరూమ్‌ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వినియోగదారుల అపారమైన విశ్వాసం, ఆదరణ తమ విజయప్రస్థానానికి ప్రధాన కారణమని తెలిపారు. రూ.499 నుంచి లక్ష వరకూ విలువ చేసే మొబైల్స్ ఇక్కడ లభిస్తాయన్నారు. రాష్ట్రంలో వంద షోరూమ్‌లు స్థాపించడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టారు. ఆఫర్ల ద్వారా అధునాతన ఫీచర్ల గల మొబైల్స్ లభిస్తాయని, ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పూలూ.. రాళ్లూ... రెండూ భరించాల్సిందే
.. అంటున్నారు తమన్నా. ఈ మధ్య హీరోయిన్స్ పబ్లిక్ అప్పియరెన్సెస్ ఇస్తే చాలు అనుకోని ఇబ్బందులకు గురవుతున్నారు. ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించటం లేదా కామెంట్స్ చేయటం జరుగుతోంది. కొంతమంది సంస్కారం మరచిపోయి పాదరక్షలు కూడా విసిరేస్తున్నారు. తమన్నాకు ఈ మధ్య అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ షోరూమ్ ఓపెనింగ్‌కు వెళ్లిన తమన్నాపై ఓ ఆకతాయి చెప్పు విసిరిన విషయం తెలిసే ఉంటుంది. అది ఆమెకు కొంచెం దూరంలో పడింది. ఆ సందర్భలో ఏమీ స్పందించకుండా వెళ్లిపోయారు తమన్నా. ఇప్పుడా సంఘటన గురించి స్పందించారామె ‘‘అలా రియాక్ట్ అయినవాళ్లను ఏమీ చేయలేం. మేం యాక్టర్స్, మా మీద ప్రేమతో వేసే పువ్వులను, ద్వేషంతో విసిరే రాళ్లను ఒకేలా స్వీకరించాలి’’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. తను ఈ మధ్య సినిమాలు చేయటం తగ్గించేశారు. ఆవిడను కలుద్దాం అంటే బౌన్సర్స్ ఆమె దగ్గరకు వెళ్లనీకుండా చేశారు. ఆ కోపంతో ఆమె వైపు షూ విసిరేశాను’’ అని పేర్కొన్నాడు ఆకతాయి. -
కాకినాడ నాకెంతో నచ్చింది..
కాకినాడ కల్చరల్ : కాకినాడ చాలా అందమైన, ఆకర్షణీయమైన నగరమని సినీ హీరోయిన్ అర్చనా వేద అన్నారు. స్థానిక మెయిన్రోడ్లో ఏర్పాటు చేసిన కమల్ వాచ్ షోరూం ప్రారంభోత్సవానికి గురువారం వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. గతంలో చాలా సార్లు సినిమా షూటింగ్‌ల కోసం కాకినాడ నగరం, కోనసీమ ప్రాంతాలను సందర్శించానన్నారు. కాకినాడ ప్రజలు తనపై చూపుతున్న అభిమానాన్ని మరువలేనని, ఇక్కడకు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుందని చెప్పారు. తన నటన తెలుగుప్రేక్షకులకు నచ్చుతోందన్నారు. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్నానని, తెలుగులో కూడా మంచి చిత్రాలు చేతిలో ఉన్నాయని తెలిపారు. బీవీసీలో సినీ సందడి అల్లవరం : రామా రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ గురువారం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. తమిళ హీరో భరత్ నాయకుడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్‌ను బీవీసీ అధినేత బోనం కనకయ్య క్లాప్ కొట్టి ప్రారంభించారు. ప్రేమ కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్గా శ్వేతాశర్మ, ప్రధాన పాత్రల్లో నరేష్, ఆలీ, రాశి, అవినాష్, శివరాం నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం రవీంద్ర భార్గవ్, నిర్మాత పూదోట సుధీర్‌కుమార్, సంగీతం విజయ కురాకుల, మేనేజర్ రుపేష్. షూటింగ్ ప్రారంభ కార్యక్రమంలో గనిశెట్టి రమణలాల్, గిడుగు భాస్కరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
సింహపురిలో శ్రీయ సందడి
-
గుంటూరంటే గౌరవం
లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్‌లైన్ :గుంటూరులో తనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారని, గుంటూరంటే తనకు అమితమైన గౌరవమని ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ అన్నారు. గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ షోరూంను ఆదివారం ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనకు ఎన్నో ఏళ్లుగా మలబార్ సంస్థతో మంచి అనుబంధం ఉందని, తాను మెచ్చిన సంస్థ మలబార్ అని ఆమె అన్నారు. సంస్థ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అషర్ మాట్లాడుతూ గుంటూరులో ప్రారంభించిన మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూమ్ ప్రపంచ వ్యాప్తంగా 110 అవుట్లెట్లను కలిగి ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఇది 11వ షోరూమ్ అని చెప్పారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొనుగోలు దారులకు బంగారం, డైమండ్ ఆభరణాలు ప్రతి గ్రాముపై రూ.120 తగ్గింపును పరిమిత కాల ఆఫర్‌గా అందిస్తున్నామన్నారు. తమ సంస్థ భవిష్యత్తులో హాంకాంగ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో అవుట్‌లెట్స్ విస్తరణ చేసే ఉద్దేశంతో ఉందన్నారు. యూరోపియన్ మార్కెట్లో సంస్థ విస్తరణకు కృషిచేస్తున్నామన్నారు. సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా వార్షిక నికర లాభంలో పది శాతం ఆరోగ్యం, విద్య, పర్యావరణం, ఉచిత గృహ నిర్మాణం, స్త్రీ సాధికారిత వంటి ఐదు రంగాల అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. 2014-15 సంవత్సరంలో సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు రూ.300 మిలియన్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అసోసియేట్ డెరైక్టర్ పి.కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ 1993లో ధక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రంలో మలబార్ సంస్థను ప్రారంభించామన్నారు. తమకు ఎనిమిది దేశాల్లో పటిష్టమైన రిటైల్ నెట్వర్క్ ఉందన్నారు. వార్షిక టర్నోవర్ 220 బిలియన్లు అని, ప్రస్తుత టర్నోవర్ ఆధారంగా ప్రపంచంలో మూడవ అతి పెద్ద జ్యూయలరీ సంస్థగా మలబార్ స్థానం సంపాదించిందన్నారు. సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రేన్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి కాంతారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మొదటి కొనుగోలుదారులకు బహుమతులు ఈ సందర్భంగా మొదటి కొనుగోలుదారులు ఎం.డి.ఎరికోల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ అధినేత దివాకర్, శర్వణ్ సాయికన్స్ట్రక్షన్స్ ఛైర్మన్ కళానిధి, శివా కన్స్ట్రక్షన్స్ చైర్మన్ శివారెడ్డి, శ్యామ్‌సంగ్ డిస్ట్రిబ్యూటర్ మట్టుపల్లి శ్రీనివాసరావు, వెంకటేష్ కన్స్ట్రక్షన్స్ సీఈవో శేషగిరి, సూర్యసాయి డెవలపర్స్ ఎం.రవికృష్ణ, జీవన్స్ మల్టీప్లక్స్ గుంటపల్లి జగజీవన్బాబు తదితరులకు కాజల్ చేతుల మీదుగా బంగారం, డైమండ్స్, అంకట్ డైమండ్స్, ప్రీషియస్ జెమ్స్ జ్యూయలరీ, హ్యాండ్‌క్రాఫ్ట్ డిజైన్డ్ జ్యూయలరీ, ఇండియన్ హెరిటేజ్ జ్యూయలరీ, వాచ్‌లను అందజేశారు. కాజల్ కోసం ఉరుకులు...పరుగులు ప్రముఖ సినీ నటి కాజల్‌అగర్వాల్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలుసుకున్న నగరంలోని యువత షోరూము వద్దకు చేరుకుని కాజల్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఆమెతో మాట్లాడాలని, ఫోటోలు దిగేందుకు చాలా ఆసక్తి కనబర్చారు. కాజల్ షోరూమ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం వెళ్ళిపోతుందని తెలుసుకున్న పలువురు యువకులు ఆమె వెళుతుండంగా పరుగులు తీశారు. మొత్తం మీద కాజల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున నగరంలోని యువతీ యువకులు షోరూమ్ వద్దకు విచ్చేసి ఆనందపడ్డారు.