గుంటూరంటే గౌరవం
గుంటూరంటే గౌరవం
Published Mon, Feb 17 2014 1:36 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
లక్ష్మీపురం(గుంటూరు), న్యూస్‌లైన్ :గుంటూరులో తనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారని, గుంటూరంటే తనకు అమితమైన గౌరవమని ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ అన్నారు. గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ షోరూంను ఆదివారం ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తనకు ఎన్నో ఏళ్లుగా మలబార్ సంస్థతో మంచి అనుబంధం ఉందని, తాను మెచ్చిన సంస్థ మలబార్ అని ఆమె అన్నారు. సంస్థ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అషర్ మాట్లాడుతూ గుంటూరులో ప్రారంభించిన మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూమ్ ప్రపంచ వ్యాప్తంగా 110 అవుట్‌లెట్లను కలిగి ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో తమకు ఇది 11వ షోరూమ్ అని చెప్పారు. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా కొనుగోలు దారులకు బంగారం, డైమండ్ ఆభరణాలు ప్రతి గ్రాముపై రూ.120 తగ్గింపును పరిమిత కాల ఆఫర్‌గా అందిస్తున్నామన్నారు. తమ సంస్థ భవిష్యత్తులో హాంకాంగ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో అవుట్‌లెట్స్ విస్తరణ చేసే ఉద్దేశంతో ఉందన్నారు.
యూరోపియన్ మార్కెట్‌లో సంస్థ విస్తరణకు కృషిచేస్తున్నామన్నారు. సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా వార్షిక నికర లాభంలో పది శాతం ఆరోగ్యం, విద్య, పర్యావరణం, ఉచిత గృహ నిర్మాణం, స్త్రీ సాధికారిత వంటి ఐదు రంగాల అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. 2014-15 సంవత్సరంలో సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు రూ.300 మిలియన్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అసోసియేట్ డెరైక్టర్ పి.కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ 1993లో ధక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రంలో మలబార్ సంస్థను ప్రారంభించామన్నారు. తమకు ఎనిమిది దేశాల్లో పటిష్టమైన రిటైల్ నెట్‌వర్క్ ఉందన్నారు. వార్షిక టర్నోవర్ 220 బిలియన్లు అని, ప్రస్తుత టర్నోవర్ ఆధారంగా ప్రపంచంలో మూడవ అతి పెద్ద జ్యూయలరీ సంస్థగా మలబార్ స్థానం సంపాదించిందన్నారు. సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రేన్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి కాంతారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మొదటి కొనుగోలుదారులకు బహుమతులు
ఈ సందర్భంగా మొదటి కొనుగోలుదారులు ఎం.డి.ఎరికోల్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్ అధినేత దివాకర్, శర్వణ్ సాయికన్‌స్ట్రక్షన్స్ ఛైర్మన్ కళానిధి, శివా కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ శివారెడ్డి, శ్యామ్‌సంగ్ డిస్ట్రిబ్యూటర్ మట్టుపల్లి శ్రీనివాసరావు, వెంకటేష్ కన్‌స్ట్రక్షన్స్ సీఈవో శేషగిరి, సూర్యసాయి డెవలపర్స్ ఎం.రవికృష్ణ, జీవన్స్ మల్టీప్లక్స్ గుంటపల్లి జగజీవన్‌బాబు తదితరులకు కాజల్ చేతుల మీదుగా బంగారం, డైమండ్స్, అంకట్ డైమండ్స్, ప్రీషియస్ జెమ్స్ జ్యూయలరీ, హ్యాండ్‌క్రాఫ్ట్ డిజైన్డ్ జ్యూయలరీ, ఇండియన్ హెరిటేజ్ జ్యూయలరీ, వాచ్‌లను అందజేశారు.
కాజల్ కోసం ఉరుకులు...పరుగులు
ప్రముఖ సినీ నటి కాజల్‌అగర్వాల్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలుసుకున్న నగరంలోని యువత షోరూము వద్దకు చేరుకుని కాజల్‌ను చూసేందుకు ఉత్సాహం చూపారు. ఆమెతో మాట్లాడాలని, ఫోటోలు దిగేందుకు చాలా ఆసక్తి కనబర్చారు. కాజల్ షోరూమ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం వెళ్ళిపోతుందని తెలుసుకున్న పలువురు యువకులు ఆమె వెళుతుండంగా పరుగులు తీశారు. మొత్తం మీద కాజల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున నగరంలోని యువతీ యువకులు షోరూమ్ వద్దకు విచ్చేసి ఆనందపడ్డారు.
Advertisement
Advertisement