విజయతీరానికి అవంతిక | tamannaah launches binue smartphone showroom in vizianagaram | Sakshi
Sakshi News home page

విజయతీరానికి అవంతిక

Published Sun, Mar 18 2018 1:37 PM | Last Updated on Sun, Mar 18 2018 1:37 PM

tamannaah launches binue smartphone showroom in vizianagaram - Sakshi

అది విజయనగరం లోయర్‌ ట్యాంక్‌బండ్‌ రోడ్‌... శనివారం ఉదయం సరిగ్గా పదిన్నర గంటలైంది. ఓ మెరుపు మెరిసినట్టు... పాలవెలుగు విరజిమ్మినట్టు... అచ్చమైన అందం నడిచొచ్చినట్టు... సినీనటి తమన్నా వచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన బిన్యూ స్మార్ట్‌ ఫోన్‌ షోరూం ప్రారంభించారు. ఆమెను చూడగానే అభిమానులు కేరింతలు కొట్టారు. 

విజయనగరం టౌన్‌: తమ అభిమాన హీరోయిన్‌ తమన్నాను చూసేందుకు  అభిమాన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌రోడ్‌ జనసంద్రమైంది. శనివారం  ఉదయం 10.30 గంటలకు సినీనటి తమన్నా  హోటల్‌ మయూరా ఎదురుగా ఉన్న   బి న్యూ  స్మార్ట్‌ మొబైల్‌ స్టోర్‌ను  లాంఛనంగా ప్రారంభించారు.  ముందుగా  స్టోర్‌ ముందు ఏర్పాటు చేసిన  స్టేజ్‌పైకి ఎక్కి అభిమానులను పలుకరించారు. అనంతరం రిబ్బన్‌ కట్‌ చేసి  షోరూమ్‌ను ప్రారంభించారు. లోపల  జ్యోతి వెలిగించి,  యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  విజయనగరం చాలా ప్రశాంతమైన వాతావరణంతో  ఉందన్నారు. బి న్యూ మొబైల్స్‌ స్టోర్‌లో   అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మొబైల్స్‌ లభిస్తాయన్నారు. 

కొత్తగా కల్యాణ్‌రామ్‌తో సినిమా పూర్తయిందని, తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా  ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వైడీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ  తమ 50వ షోరూమ్‌ని  ప్రారంభించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.  వినియోగదారుల అపారమైన విశ్వాసం, ఆదరణ తమ విజయప్రస్థానానికి ప్రధాన కారణమని తెలిపారు.  రూ.499 నుంచి  లక్ష వరకూ విలువ చేసే మొబైల్స్‌ ఇక్కడ లభిస్తాయన్నారు. రాష్ట్రంలో వంద షోరూమ్‌లు స్థాపించడమే తమ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులకు  ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టారు.  ఆఫర్ల ద్వారా అధునాతన ఫీచర్ల గల మొబైల్స్‌ లభిస్తాయని, ప్రజలు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement