
కన్నడ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కేజీఎఫ్. దీనికి సీక్వెల్‌గా వస్తోంది కేజీఎఫ్ చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 14) విడుదల కాబోతోంది. ఈ క్రమంలో యాంకర్ సుమ కేజీఎఫ్ చిత్రయూనిట్‌ను ఇంటర్వ్యూ చేసింది. యశ్, ప్రశాంత్‌నీల్‌లకు వరుస ప్రశ్నలు విసురుతూ ఎన్నో ఆసక్తికర అంశాలను రాబట్టింది.
తుఫాన్ సాంగ్ 24 గంటల్లో 26 మిలియన్ వ్యూస్ రాబట్టడం మామూలు విషయం కాదని చెప్పుకొచ్చింది. మీరు ఇండియాకే కాదు ప్రపంచానికే నచ్చారంటూ యశ్‌ను ఆకాశానికెత్తింది. హిందీ సినిమాలు చేస్తారా? అన్న ప్రశ్నకు యశ్ మాట్లాడుతూ.. నన్ను ఇన్నిరోజులు సపోర్ట్ చేసిన ఆడియన్స్‌ను వదిలేసి ఎక్కడికో ఎందుకు వెళ్తాను? కాకపోతే నా సినిమాలు అంతటా డబ్ చేస్తాను అని ఆన్సరిచ్చాడు. అనంతరం సుమ.. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు అన్న డైలాగ్ అద్భుతమని, ఇది ఎవరు రాశారని అడిగింది. దీనికి యశ్ స్పందిస్తూ అది రాసింది తానేనని బదులిచ్చాడు. మరి కేజీఎఫ్ టీమ్‌తో సుమ ఇంకా ఏమేం మాట్లాడిందో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment