Srinidhi Shetty Gives Clarity On KGF Hero Yash Rumours - Sakshi
Sakshi News home page

Srinidhi Shetty: యశ్‌ ఒళ్లంతా విషమే.. వేధించాడంటూ ట్వీట్‌ వైరల్‌.. స్పందించిన హీరోయిన్‌

Mar 17 2023 3:01 PM | Updated on Mar 17 2023 3:48 PM

Srinidhi Shetty Gives Clarity On KGF Hero Yash Rumours - Sakshi

అతడితో మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని శ్రీనిధి చెప్పిందట! హీరో ఒళ్లంతా విషమేనని, తనను తెగ వేధించాడని

సెలబ్రిటీలను ఆరాధించేవాళ్లే కాదు. కావాలని బురద చల్లేవాళ్లు కూడా ఉంటారు. స్టార్స్‌ను టార్గెట్‌ చేస్తూ వారి గురించి కారుకూతలు కూస్తూ పబ్బం గడుపుకుంటారు. విమర్శించడమే పనిగా పెట్టుకుని పేరు గడిద్దామనుకుంటారు. ఇందుకోసం హద్దులు మీరి మరీ అడ్డదిడ్డంగా మాట్లాడతారు. ఆ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు ఉమైర్‌ సంధు. ఓవర్సీస్‌ సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ అని చెప్పుకుని తిరిగే ఆయనకు సెలబ్రిటీల గురించి తప్పుడు వార్తలు రాయనిదే నిద్ర కూడా పట్టదు. 

సెలబ్రిటీల మీద చెత్త వాగుడు వాడే ఉమైర్‌ ఇటీవల కేజీఎఫ్‌ స్టార్స్‌ మీద పడ్డాడు. యశ్‌తో పని చేయడం ఎంతో అసౌకర్యంగా ఉందని, అతడితో మళ్లీ కలిసి పనిచేసే ప్రసక్తే లేదని శ్రీనిధి చెప్పిందట! హీరో ఒళ్లంతా విషమేనని, తనను తెగ వేధించాడని ఉమైర్‌తో వాపోయిందట. ఈ తంతును ట్విటర్‌లో రాసుకొచ్చాడు ఉమైర్‌ సంధు. యశ్‌ ఫ్యాన్స్‌ ఊరుకుంటారా? క్రిటిక్‌ అని చెప్పుకునే అతడిని చెడుగుడు ఆడేసుకున్నారు. అయితే ఈ విషయం శ్రీనిధి దాకా వెళ్లింది. అతడు రాసింది చదివాక ఆమె మనసు నొచ్చుకుంది. వెంటనే ట్విటర్‌లో రియాక్ట్‌ అయింది.

'సోషల్‌ మీడియాను కొంతమంది దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసేందుకు వినియోగిస్తున్నారు. నేనైతే ప్రేమను, ఆనందాన్ని.. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులను ప్రశంసించేందుకు ఉపయోగిస్తాను. ఇక్కడ మీకో విషయం మరోసారి చెప్పాలనుకుంటున్నా.. కేజీఎఫ్‌తో ఓ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ సినిమాలో యశ్‌తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. అతడు కేవలం జెంటిల్‌మెన్‌ మాత్రమే కాదు.. ఓ మెంటార్‌, స్నేహితుడు, ఆదర్శప్రాయుడు. రాకింగ్‌ స్టార్‌ యశ్‌కు నేనెల్లప్పుడూ అభిమానినే అంటూ ఓ నోట్‌ రిలీజ్‌ చేసింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ మా క్వీన్‌ కౌంటరిచ్చింది, అయినా ఎవడో పిచ్చివాగుడు వాగాడని నువ్వు మనసు చిన్నబుచ్చుకోకు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement