Anchor Suma Kanakala Childhood School Days Dancing Photo Shared - Sakshi
Sakshi News home page

ఈ టాప్‌ యాంకర్‌ను గుర్తుపట్టారా?

Published Tue, Feb 16 2021 7:27 PM | Last Updated on Tue, Feb 16 2021 8:03 PM

Suma Kanakala Shares Childhood Dancing Photo - Sakshi

గలగలపారే సెలయేరు, కనకాల సుమ నోటి నుంచి వచ్చే మాటల ప్రవాహం రెండూ సేమ్‌ టు సేమ్‌. అలుపెరగకుండా ముందుకు సాగే ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. స్వస్థలం కేరళ అయినా ఇక్కడి అబ్బాయిని పెళ్లాడి తెలుగింటి అమ్మాయిగా మారిపోయిందావిడ. కేవలం యాంకరింగే కాకుండా నటన, నాట్యం, సంగీతంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. మొదట్లో అడపాదడపా సినిమాల్లో నటనతో ఆకట్టుకున్న సుమ తర్వాత యాంకరింగ్‌కే పెద్ద పీట వేస్తూ తెలుగునాట నెంబర్‌ 1 వ్యాఖ్యాతగా నిలిచింది. ఏళ్లు గడుస్తున్నా బుల్లితెర మీద సుమ స్థానం చెక్కు చెదరలేదు. పలు టీవీ షోలతో బిజీబిజీగా ఉన్న సుమ తాజాగా ఓ ఫొటోను షేర్‌ చేసింది.

"అమ్మకు నాట్యం అంటే చాలా ఇష్టం. నేను నాట్యం చేస్తుంటే చూడాలని ఎంతో ఇష్టపడేది. నేను కూడా డ్యాన్స్‌ చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేసేదాన్ని. బద్ర అని నాకో డ్యాన్స్‌ టీచర్‌ ఉండేది. ఆమె నేతృత్వంలో స్కూల్‌ డేస్‌లో పర్ఫామ్‌‌ చేసినప్పుడు తీసిన ఫొటో ఇది" అని రాసుకొచ్చింది. ఇక ఈ ఫొటో చూసిన అభిమానులు 'నువ్వు సూపర్‌ టాలెంటెడ్‌ అక్కా..' అని పొగుడుతున్నారు. మరికొందరేమో 'ఈ ఫొటోలో సుమను గుర్తుపట్టడం కాస్త కష్టంగానే ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: సింగర్‌ సునీతకు సుమ కాస్ట్‌లీ గిఫ్ట్‌?

విజయ్‌తో సారా అలీఖాన్‌ సెల్ఫీ.. ఫొటో వైరల్‌

‘ఉప్పెన’ వీకెండ్‌ కలెక్షన్‌ రూ. 50 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement