
బిగ్‌బాస్ షోకు, సుమకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి సీజన్‌కు ఆమె ఆహ్వానం అందుతూనే ఉంది. పిలిచినప్పుడల్లా కాదనుకుండా ఆమె వస్తూనే ఉంది. నేడు ఉగాదిని పురస్కరించుకుని బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టింది జయమ్మ. అవును, ఈసారి యాంకర్ సుమగా కాకుండా జయమ్మ పంచాయితీ కథానాయిక జయమ్మగా షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఎప్పటిలాగే తన హుషారైన మాటలతో హౌస్‌లో జోష్ నింపింది. అలాగే కొందరు కంటెస్టెంట్లపై చమత్కారాలు కూడా పేల్చింది. పంపు కాదు పాతాళగంగ అంటూ మిత్రను ఆటపట్టించింది. మరోవైపు అఖిల్ సార్థక్ గిఫ్టులు వచ్చాయంటూ హౌస్‌లోని అమ్మాయిలను ఏప్రిల్ ఫూల్ చేశాడు. ఈ సరదా ఎపిసోడ్ చూడాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే!
చదవండి: 'దరిద్రం, ఎన్నిసార్లు చెప్పినా మారడు అని చిరంజీవి తిట్టారు'
Comments
Please login to add a commentAdd a comment