బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ రచ్చ రంబోలా.. | Bigg Boss 3 Telugu: Anchor Suma Enters Into House | Sakshi
Sakshi News home page

‘ఇద్దరు’ యాంకర్లు ఒకేచోట.. హంగామా

Published Mon, Oct 28 2019 2:11 PM | Last Updated on Tue, Oct 29 2019 1:01 PM

Bigg Boss 3 Telugu: Anchor Suma Enters Into House - Sakshi

తను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే. పిల్లోడి నుంచి ముసలోళ్లదాకా ఆమె పేరు తెలియని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర నుంచి సినీ పరిశ్రమ దాకా అందరికీ ఆమె సుపరిచితురాలే. క్యాలెండర్లు మారుతున్నా ఆమె స్థానం మాత్రం సుస్థిరంగా కొనసాగుతోంది. బుల్లితెర కార్యక్రమాల్లోనూ ఆమెదే పైచేయి. తను ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తిరుగే ఉండదు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతమంతా ఎవరి గురించి చెప్తున్నామో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అవును మీరు ఊహించింది నిజమే.. ఆవిడే ప్రముఖ యాంకర్‌.. సుమ కనకాల.

వారం రోజుల్లో బిగ్‌బాస్‌ షోకు శుభం కార్డు పడనుండటంతో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి సుమను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ ఫన్నీ టాస్క్‌లు చేయిస్తోంది. తన పంచ్‌లతో ఒక్కొక్కరినీ రఫ్ఫాడిస్తోంది. సుమ ఎంట్రీ వల్ల ఇంట్లో సంతోషాల సరదాలు తారస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. మరి టీవీ కార్యక్రమాల్లో తనదైన శైలిలో ఆటపాటలతో అలరించే సుమ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇంకా ఎలాంటి సందడి చేయనుందో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement