బిగ్‌బాస్‌: శ్రీముఖి కల నెరవేరబోతుంది | Bigg Boss 3 Telugu: Housemates Reacts Their Fans Tweets | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: బాబా ఊసరవెల్లి, రాహుల్‌ నక్క నెటిజన్ల కామెంట్లు

Published Wed, Oct 30 2019 10:38 AM | Last Updated on Thu, Oct 31 2019 10:51 AM

Bigg Boss 3 Telugu: Housemates Reacts Their Fans Tweets - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు 3 సీజన్‌ వంద రోజులు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది. దీపావళి సందర్భంగా ఇంట్లో అడుగుపెట్టిన సుమ పంచ్‌లు పేల్చుతూ నానా హడావుడి చేసింది. బిగ్‌బాస్‌.. గత ఎపిసోడ్‌లో మోస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన వరుణ్‌కు ఒక అభిమానితో కాల్‌ మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజామబాద్‌ నుంచి ఫోన్‌ చేసిన రవి.. ‘వితిక వెళ్లిన తర్వాత డల్‌ అయినట్టు అనిపిస్తుంది’ వరుణ్‌తో పేర్కొన్నాడు. దీనికి వరుణ్‌ సమాధానమిస్తూ ‘పెళ్లైన అయిదేళ్లలో ఇంత దగ్గరగా ఉన్నది లేదు. అందుకే కాస్త డల్‌ అయినా కావచ్చు’ అని తెలిపాడు. అనంతరం మిగతా ఇంటి సభ్యులకు కూడా వాళ్ల ఫ్యాన్స్‌ పంపిన మెసేజెస్‌ చదివి వినిపించారు. వీటిలో ముఖ్యంగా ఒకవైపు కంటెస్టెంట్లను పొగుడుతూనే మరోవైపు వారు చేసిన తప్పిదాలను వేలెత్తి చూపించారు. ‘టాస్క్‌ల్లో అలీ బెస్ట్ కంటెస్టెంట్‌, వెల్‌కమ్‌ టు ద ఫ్రూట్‌ క్లబ్‌’ అంటూ వచ్చిన మెసేజ్‌లను అలీ చదివి వినిపించాడు. శ్రీముఖికి వచ్చిన ట్వీట్స్‌లో ఆమె ‘కన్నింగ్‌ అని, టాస్క్‌ల్లో జెండర్‌ కార్డు వాడుతుంద’ని విమర్శించారు. మరొక నెటిజన్‌ మాత్రం ‘బ్యూటీ విత్‌ బ్రెయిన్’ అని రాసి పంపించడంతో శ్రీముఖి సంతోషంగా ఫీల్‌ అయింది.

తిట్టినా థ్యాంక్స్‌ చెప్పిన వరుణ్‌...
బాబాకు రెండు రకాల ట్వీట్లు వచ్చి పడ్డాయి. ‘బిగ్‌బాస్‌ షోలో బాబా.. బెస్ట్‌ కంటెస్టెంట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కా బాప్‌’ అంటూ పాజిటివ్‌ కామెంట్లు వచ్చాయి.  అదేవిధంగా ‘ఊసరవెల్లి, బాబా మాస్కర్‌’ అంటూ వచ్చిన నెగెటివ్‌ ట్వీట్లను బాబా చదివి వినిపించాడు. ఇక ‘ఈ సీజన్‌లోనే వరస్ట్‌ కంటెస్టెంట్‌.. హౌలే ఫ్రూట్‌ వరుణ్‌ సందేశ్‌’ అని వచ్చిన మెసేజ్‌ చదివిన వరుణ్‌ ఆ ట్వీట్‌ చేసినవారికి చిరునవ్వుతోనే కృతజ్ఞతలు తెలిపాడు. ‘రాహుల్‌ చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడని, వరుణ్‌తో టాస్క్‌ ఆడిన విధానం బాగుంది’ అని ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ను రాహుల్‌ చదివి వినిపించాడు. రాహుల్‌ను నక్కతో పోల్చుతూ అగ్రెసివ్‌ అని తిట్టిపోసిన కామెంట్‌ను కూడా చదివాడు. అయితే ఏదైనా సరే పాజిటివ్‌గానే తీసుకుంటానని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులు ప్రేక్షకుల ప్రతినిధిగా ఎంట్రీ ఇచ్చిన సుమతో కలిసి దీపావళి పండగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇంటి సభ్యులందరూ స్టెప్పులేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాహుల్‌, శ్రీముఖి కలిసి డాన్స్‌ చేయడం హైలెట్‌గా నిలిచింది. అనంతరం సుమ బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వీడ్కోలు తీసుకుంది.

ఇంటి సభ్యుల జాతకాలు...
ఇంటి సభ్యుల సందేహాలు తీర్చడానికి బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఓ జ్యోతిష్యురాలిని పంపించారు. ఆమె హౌస్‌మేట్స్‌కు సందేహాల నివృత్తితోపాటు పలు సూచనలు చేసింది. ‘ఏదైనా మన మంచికే అనుకుంటూ చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలి’ అని బాబా భాస్కర్‌కు సూచించింది. ‘మీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. త్వరలో మీ కల నెరవోరుబోతుంది’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అంటే, అది బిగ్‌బాస్‌ టైటిల్‌ అయుండొచ్చు అని రాములమ్మ అభిమానులు గంతులేస్తున్నారు. ఇక ‘మీకు ఉన్న సమస్య ముగియబోతుంది’ అని రాహుల్‌కు తెలిపింది. ‘ఆలోచనా పరిధి మార్చుకో’మని అలీ రెజాకు సలహా ఇచ్చింది. వరుణ్‌ను ‘ఇగోకు వెళ్లొద్దు’ అని సూచించింది. కాగా టాబ్లెట్‌ ఇవ్వమని రాహుల్‌ బిగ్‌బాస్‌ను అడిగాడు. అయితే వెరైటీగా ఫన్నీ లిరిక్స్‌తో పాట రూపంలో కోరడంతో అందరి మొహంలో నవ్వులు విరిశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement