
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ముగిసి వారం గడిచింది. కంటెస్టెంట్ల పార్టీలు, ఇంటర్వ్యూలు రోజుకొకచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే, రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బిగ్‌బాస్ పూర్తికాగానే ఆమె ఎంచక్కా మాల్దీవుల టూర్‌కు వెళ్లిపోయింది. సముద్ర తీరంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ ట్రిప్‌లో ఆర్జే చైతూ, యాంకర్ విష్ణుప్రియ కూడా ఉన్నారు. ఇక బిగ్‌బాస్ షో జరుగుతున్న సమయంలో హోస్ట్ నాగార్జున ఓ సందర్భంలో శ్రీముఖిని.. ‘మీరు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచి రూ.50 లక్షలు మీ సొంతమైతే.. ఏం చేస్తారు’ అని ప్రశ్నించగా.. అన్నీ పేరెంట్స్‌కు ఇస్తానని సమాధానమిచ్చింది. అంతేగాక తనకెంతో ఇష్టమైన మాల్దీవులకు వెళ్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది.
కానీ, ఆమె రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నా.. మాల్దీవులకు వెళ్లి తన కోరిక నెరవేర్చుకుంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి మాల్దీవుల్లో ఆమె చేస్తున్న సందడిని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను పలకరిస్తోంది. ఏదేమైనా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న 105 రోజులు శ్రీముఖి చలాకీగా, దూకుడుగా ఉంటూ అందరినీ ఆకర్షించింది. టాస్క్‌ల్లోనూ విజృంభించి మిగతా హౌస్‌మేట్స్‌కు గట్టిపోటీనిచ్చింది. కానీ, షో చివరి రోజుల్లో రాహుల్ అనూహ్యంగా పుంజుకోవటంతో ఆమె రెండోస్థానంలో నిలిచింది. ఇక, విన్నర్‌గా నిలవలేకపోయినందుకు శ్రీముఖి బాధపడినా.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలవడం కాస్త ఊరటనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment