Bigg Boss 3 Telugu: టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌.. - Sakshi
Sakshi News home page

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

Nov 6 2019 3:06 PM | Updated on Nov 16 2019 3:36 PM

Sreemukhi Received More Money As Remuneration For Bigboss - Sakshi

బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ మొత్తమే దక్కిందని తెలుస్తోంది.

హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ విన్నర్‌ రాహుల్‌ కంటే అధికంగా రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి రెమ్యూనరేషన్‌ రూపంలో ఎక్కువ మొత్తం ఇంటికి తీసుకువెళ్లిందని సమాచారం. బిగ్‌బాస్‌ విజేతతో పోలిస్తే హౌస్‌లో ఉన్నన్ని రోజులు శ్రీముఖికి పారితోషికంగా భారీ మొత్తమే నిర్వాహకులు ముట్టజెప్పారని భావిస్తున్నారు. టీవీ యాంకర్‌గా రెండు తెలుగురాష్ట్రాల్లో పేరున్న శ్రీముఖి బుల్లితెరపై హయ్యస్ట్‌ పెయిడ్‌ నటిగా గుర్తింపు పొందడంతో బిగ్‌బాస్‌ షోలోనూ భారీగా రాబట్టారు. 14 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్‌బాస్‌ తెలుగు 3 హౌస్‌లో అడుగుపెట్టిన శ్రీముఖి ఏకంగా 105 రోజుల పాటు హౌస్‌లో కొనసాగడంతో పాటు టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. గ్రాండ్‌ ఫినాలేలో టైటిల్‌ను రాహుల్‌ సిప్లీగంజ్‌ ఎగరేసుకుపోవడంతో ఆమె రన్నరప్‌గా మిగిలారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా రాహుల్‌కు రూ 50 లక్షలు దక్కగా శ్రీముఖి అంతకుమించే ఈ షోలో ఆర్జించారని వినికిడి. భారీ పే చెక్‌తో శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చారని సమాచారం.
చదవండి: త్వరలోనే పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

రోజుకు రూ లక్ష..
బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా సత్తా చాటిన శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు రోజుకు రూ లక్ష డిమాండ్‌ చేసినట్టు చెబుతున్నారు. ఆమె పాపులారిటీకి ఫిదా అయిన నిర్వాహకులు షోకు సైన్‌ చేసేముందు పునరాలోచన లేకుండా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. 105 రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి కొనసాగడంతో కాంట్రాక్టు ప్రకారం రూ 1.05 కోట్ల చెక్‌ ఆమెకు దక్కింది. టైటిల్‌ విజేత రాహుల్‌ సహా ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే ఆమె రెమ్యూనరేషన్‌ చాలా అధికం కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement