
కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 3 తెలుగు సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. 100 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసిన బిగ్‌బాస్ షో సెంచరీ కొట్టింది. బిగ్‌బాస్ ఇంట్లోకి ఒక ప్రేక్షకురాలిగా వస్తున్నానంటూ అడుగుపెట్టిన సుమ ఇంటి విషయాలను రాబట్టడానికి ప్రయత్నించింది. సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లోకి రాగానే ఇంటి సభ్యులతో బోలెడు కబుర్లను పంచుకుంది. బిగ్‌బాస్‌కే పంచ్‌లు విసురుతూ నానా హంగామా చేసింది. పనిలోపనిగా ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్ ఆడించింది.
ఆ గేమ్‌లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన వరుణ్‌ను విజేతగా ప్రకటించింది. అయితే.. సుమ ఇంట్లోకి రాగానే మొదటగా.. టపాకాయలు తెచ్చావా అని హౌస్‌మేట్స్ ప్రశ్నించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ తనవెంట ఏమీ తీసుకురాలేదని సుమ చెప్పుకొచ్చింది. ఇంటి సభ్యుల ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న బిగ్‌బాస్ దీపావళి పండగను జరుపుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకోసం వారికి టపాకాయలు అందించినట్టు కనిపిస్తోంది. దీంతో దొరికిందే చాన్స్ అన్నట్టుగా ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. వీరి అల్లరికి సుమ తోడవగా.. దీపావళి వేడుకలతో హౌస్ వెలుగులీనేలా ఉంది. ఇంటి సభ్యులు కాకర పువ్వొత్తులను చేతపట్టుకుని ఆనందంతో డాన్స్‌లు చేస్తున్నారు. ఇక ఈ సంబరాలను వీక్షించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే!
. #Diwali celebration continues with @ItsSumaKanakala #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/0MuAV2HQ7D
— STAR MAA (@StarMaa) October 29, 2019