Mahesh Babu Launched Release Trailer Of Suma Kanakala Jayamma Panchayathi Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Jayamma Panchayathi Release Trailer: ‘జయమ్మ పంచాయితీ’ట్రైలర్‌ రివ్యూ

Published Wed, May 4 2022 11:21 AM | Last Updated on Wed, May 4 2022 11:52 AM

Mahesh Babu Unveiled Release Trailer Of Jayamma Panchayathi - Sakshi

‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ అంటుంది యాంకర్‌ సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయమ్మ పంచాయితీ. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించిన‌ ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా జయమ్మ పంచాయితీ ట్రైలర్‌ని విడుదల చేశారు. కామెడీ డ్రామాతో పాటు భావోద్వేగాలు ఉండేలా ట్రైలర్‌ని కట్‌ చేశారు మేకర్స్‌. 

ట్రైలర్‌లో ఏముందంటే.. పిల్ల ఫంక్షన్‌ చేసి వచ్చిన డబ్బులతో భర్తకు ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటుంది జయమ్మ. అది జరగదు.దీంతో తీవ్ర నిరాశకు లోనవుతుంది. ఎలాగైన భర్తకు ఆపరేషన్‌ చేయించుకోవాలనుకుంటుంది. అదే సమయంలో గ్రామంలోని ఓ యువకుడు తన కూతురితో సరసాలాడడానికి ప్రయత్నిస్తాడు. అతని నుంచి కూతురిని కాపాడుకుందా? జయమ్మ పెట్టిన పంచాయితీ ఏంటి? దాని వల్ల గ్రామ పెద్దలకు ఎదురైన సమస్యలు ఏంటి? తెలియాలంటే మే 6న థియేటర్స్‌లో ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే. 

(చదవండి: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్‌ రివీల్‌ చేసిన యాంకరమ్మ)

కామెడీ డ్రామాతో పాటు ఎమోషనల్‌గా ‘జయమ్మ పంచాయితీ’ మూవీ సాగనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ‘నా ఎనబైయేళ్ల జీవితంతో ఇలాంటి గొడవ వినలేదు, చూడలేదు’అని ఓ పెద్దాయన అనడం.. ‘తెల్లారికల్లా నా విషయం తేల్చలేదంటే.. ఊళ్లో ఎవరెవరైతే పెద్ద మనుషులని తిరుగుతున్నారో ఆలింటిముందే ఆళ్లకు పిండం పెట్టకపోతే సూడండి’అంటూ జయమ్మ వార్నింగ్‌ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమ తన సహజ నటనతో ఆదరగొట్టినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. ‘గుండాలు తొక్కిన గండం గట్టేకినట్టే ఉంది’.‘చావడం సులువే.. బతికి బాధ్యతలు తీసుకోవడమే కష్టం’ లాంటి డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. దినేష్‌ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా  నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అదించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement