
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. వాక్చాతుర్యంతో, కామెడీ పంచులతో ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్వించగలదీ లేడీ యాంకర్. ఆమె యాంకర్‌గా కెరీర్ ఆరంభించడాని కంటే ముందు నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సీరియళ్లు, సినిమాల్లో నటించింది. తర్వాత నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుని యాంకర్‌గా సెటిలైంది. అయితే రెండు, మూడు రోజులుగా ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై సుమ కూడా ఇంతమంది అడుగుతున్నారంటే చేస్తే పోలే.. అని క్లూ వదిలింది.
తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సుమ. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టర్ వదిలింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్, ఫస్ట్ లుక్ నవంబర్ ఆరున రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఎమ్‌ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ పోస్టర్‌లో బియ్యం దంచడానికి సుమ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ ఆమె ముఖం మాత్రం చూపించలేదు. ఆమె చేతిపై వెంకన్న అనే పేరు పచ్చబొట్టు వేయించుకున్నట్లుగా చూపించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియలాంటే ఇంకో మూడు రోజులు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment