అమ్మమ్మ వందో బర్త్‌డే వేడుకల్లో సుమ | Suma's grandma's birthday celebrations | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ వందో బర్త్‌డే వేడుకల్లో సుమ

Published Tue, Sep 6 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

Suma's grandma's birthday celebrations

హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా టెలివిజన్ రంగంలో యాంకర్ గా కొనసాగుతున్న సుమ.. ఇప్పటికీ ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తారు. ఆమె ఆరోగ్య రహస్యం ఏమిటని అభిమానులు తరచూ ప్రశ్నిస్తుంటారు. అరుదైన వేడుక సందర్భంగా సుమ తన శక్తి రహస్యాలను వెల్లండించారు. ఆ వేడుక.. సుమ అమ్మమ్మగారి వందో పుట్టినరోజు!

పెదవులపై చిరునవ్వు, నిర్మలమైన మనసు, ఒత్తిడిలేని జీవితం, అందరూ బాగుండాలనే ఆకాంక్ష.. ఇవే అమ్మమ్మ వందేళ్ల నిండు జీవితానికి కారణాలని, ఆమె అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తున్నానని, ఆ లక్షణాలే తనకు శక్తినిస్తాయని సుమ చెప్పారు. మంగళవారం సుమ అమ్మమ్మ పల్లసన పచ్చువిట్టిల్ సావిత్రమ్మ వందో పుట్టినరోజు వేడులను కేరళలోని ఆమె కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భర్త రాజీవ్ కనకాలతో కలిసి సుమ కేరళ వెళ్లారు. అమ్మమ్మ వందేళ్ల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మర్చిపోలేని రోజని, అరుదైన ఈ రోజును ఆనందంగా గడుపుతున్నానని సుమ చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement