Jayamma Panchayathi: Anchor Suma Visits Warangal With Movie Team, Details Inside - Sakshi
Sakshi News home page

Anchor Suma Movie: వరంగల్‌లో ‘జయమ్మ పంచాయతీ’ సందడి

Published Wed, Apr 27 2022 3:12 PM | Last Updated on Wed, Apr 27 2022 4:25 PM

Anchor Suma Visits Warangal With Jayamma Panchayathi Movie Team - Sakshi

ప్రముఖ యాంకర్‌ సుమ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రం బృందం మంగళవారం హనుమకొండలో పర్యటించింది. ముందుగా భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో జయమ్మ పంచాయితీ విజయం ఖాయమైందన్నారు.

పూర్తిగా గ్రామీణ నేపథ్యోంలో ఈ మూవీని రూపొందించామని, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు మా సినిమా బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.ఈ చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషించానని, చదివింపుల చుట్టూ ఈ కథ ఉంటుందని చెప్పారు. మనిషికి మనిషి ఎలా సహాయంగా నిలబడాలో ఈ చిత్రం తెలుపుతుందన్నారు. కాగా ఈ సమావేశంలో సుమతో పాటు మిగతా నటీనటులు శాలిని, భవన్‌, దినేశ్‌ కుమార్‌, త్రినాథ్‌లు పాల్గొన్నారు. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్‌ దర్శకత్వం వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement