Bhadrakali temple in Warangal
-
వరంగల్ భద్రకాళి అమ్మవారు ఆలయానికి పోటెత్తిన భక్తులు
-
వరద నీటి దిగ్బంధంలో భద్రకాళి అమ్మవారి టెంపుల్ ప్రాంతం
-
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా
-
వరంగల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాంకర్ సుమ
ప్రముఖ యాంకర్ సుమ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయతీ. మే 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రం బృందం మంగళవారం హనుమకొండలో పర్యటించింది. ముందుగా భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో జయమ్మ పంచాయితీ విజయం ఖాయమైందన్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యోంలో ఈ మూవీని రూపొందించామని, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు మా సినిమా బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.ఈ చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషించానని, చదివింపుల చుట్టూ ఈ కథ ఉంటుందని చెప్పారు. మనిషికి మనిషి ఎలా సహాయంగా నిలబడాలో ఈ చిత్రం తెలుపుతుందన్నారు. కాగా ఈ సమావేశంలో సుమతో పాటు మిగతా నటీనటులు శాలిని, భవన్, దినేశ్ కుమార్, త్రినాథ్‌లు పాల్గొన్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహించారు. -
భద్రకాళీ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు
వరంగల్ : ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మ వారికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు మొక్కును చెల్లించుకున్నారు. రూ.3.70కోట్ల విలువైన 11 కిలోల 700 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. ఆదివారం ఉదయం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయాధికారులు, వేద పండితులు సీఎంకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పలు ఆలయాల్లో దేవుళ్లకు నగలు సమర్పిస్తానని సీఎం మొక్కుకున్న విషయం తెలిసిందే. -
భద్రకాళీ అమ్మవారికి సీఎం మొక్కులు
-
భద్రకాళీ అమ్మవారికి సీఎం మొక్కులు
సాక్షి, హైదరాబాద్: భద్రకాళి అమ్మవారి మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మొక్కిన మొక్కులన్నీ చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కేబినెట్ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని సీఎం పరిశీలించారు. 11 కిలోల 700 గ్రాముల బంగారంతో జీఆర్టీ జువెల్లర్స్ ఈ కిరీటం తయారు చేశారు. రూ.3.70 కోట్ల విలువైన ఈ కిరీటాన్ని ఆదివారం ముఖ్యమంత్రి సతీ సమేతంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తారు. శనివారం రాత్రికే సీఎం వరంగల్‌కు వెళ్లేలా ప్రణాళిక ఖరారైంది. కిరీటాన్ని పరిశీలించిన వారిలో సీఎం సతీమణి శోభ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, ముఖ్యమంత్రి సలహాదారు కేవీ రమణాచారి తదితరులు ఉన్నారు. -
సీఎం మొక్కులు: 3 కోట్లతో 'భద్రకాళి'కి స్వర్ణ కిరీటం
హైదరాబాద్ : వరంగల్‌లో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొక్కులు చెల్లించుకోనున్నారు. రూ.3కోట్లతో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహుకరించనున్నారు. ఇటీవలే అందుకు సంబంధించి బంగారు కిరీటం కోసం కొలతలు తీసుకొని అంచనాలు తయారు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే వివిధ ఆలయాల్లోని దేవుళ్లకు నగలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. అలాగే వరంగల్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు,తిరుమల వెంకన్న, విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవార్లకు ముక్కుపుడకలు రాష్ట్ర ప్రభుత్వం చేయించనుంది. వీటికోసం దేవాదాయశాఖ నిధులను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నగలను సిద్ధం చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని.. దాదాపు రెండు కిలోల బరువుతో వజ్రవైఢూర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. దీనికి దాదాపు రూ.5.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు.