Jayamma Panchayathi OTT Release Date Confirmed - Sakshi
Sakshi News home page

Jayamma Panchayathi: ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న జయమ్మ పంచాయితీ

Published Sat, Jun 11 2022 7:27 PM | Last Updated on Sun, Jun 12 2022 10:40 AM

Jayamma Panchayathi OTT Release Date Confirmed - Sakshi

యాంకర్‌ సుమ కనకాల ప్రధానపాత్రలో నటించిన మూవీ జయమ్మ పంచాయితీ. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాశ్‌ నిర్మించారు. దినేష్‌ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా  నటించగా ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అదించారు. మే6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పర్వాలేదనిపించింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమ సహజ నటనతో అదరగొట్టేసింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌ కాబోతోంది. జూన్‌ 14 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. మరి థియేటర్‌లో సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే జయమ్మ పంచాయితీ ఏంటో ఓ లుక్కేయండి.

చదవండి: భర్తకు నయన్‌ రూ.20 కోట్లు విలువ చేసే గిఫ్ట్‌, మరి విఘ్నేశ్‌ ఏమిచ్చాడో తెలుసా?
సుకృతి ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement