Anchor Suma Acted As Prabhas Sister In Varsham Movie - Sakshi
Sakshi News home page

Prabhas-Suma: ఒకే సినిమాలో ప్రభాస్-సుమ.. చెప్పుకోండి చూద్దాం!

Published Wed, Jun 28 2023 1:49 PM | Last Updated on Wed, Jun 28 2023 4:47 PM

Prabhas Sister Role Suma Varsham Movie - Sakshi

ఎక్కడ చూసినాసరే హీరో ప్రభాస్ కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు. 'ఆదిపురుష్'పై వివాదాలు, మరోవైపు 'సలార్' రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఇలా డార్లింగ్ హీరోని సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మార‍్చేశాయి. ఇదే టైంలో ప్రభాస్ గురించి ఓ విషయం వైరల్ అవుతోంది. ఓ చిత్రంలో ప్రభాస్‌కి అక్కగా యాంకర్ సుమ నటించిందని అంటున్నారు. మరి ఆ మూవీ ఏంటో మీలో ఎవరికైనా తెలుసా?

(ఇదీ చదవండి: 'సలార్' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకేమో టెన్షన్!)

తెలుగులో యాంకర్ అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తొచ్చేది సుమ కనకాల. తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ మనలో కలిసిపోయింది. నటుడు రాజీవ్ కనకాలని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాలు, సీరియల్స్ లో నటించిన సుమ.. ఆ తర్వాత మాత్రం రూట్ మార్చి యాంకర్ గా సెటిలైపోయింది. గతేడాది 'జయమ్మ పంచాయతీ' చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. లీడ్ రోల్ లో నటించింది గానీ హిట్ కొట్టలేకపోయింది.

సరే అసలు విషయానికొచ్చేస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. 'ఈశ్వర్'తో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ 'వర్షం'తో తొలి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలోనే ప్రభాస్ కి అక్కగా సుమ నటించింది. కాకపోతే అది ఆమె కెరీర్ ప్రారంభంలో కావడంతో ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు. 'రామబాణం' ప్రమోషన్స్ టైంలోనూ గోపీచంద్ ఇదే విషయమై సుమని ఆటపట్టించాడు! బహుశా స‍్టోరీ చదువుతున్న మీలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు!?

(ఇదీ చదవండి: మొదటి ముద్దు.. డెటాల్‌తో నోరు కడుక‍్కున్నా: ప్రముఖ నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement