
మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. తనకు ఎలాంటి చెడ్డ అలవాటు లేకపోయేది. కానీ ఎవడో పేకాట నేర్పాడు. నాన్న పేకాట ఆడటం చూసి ఊళ్లోవాళ్లు ఎందుకు సుబ్బారావు
సినీ ప్రేమికులకు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నటుడిగా, కమెడియన్‌గా, దర్శకనిర్మాతగా, రచయితగా పనిచేసిన పోసాని తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు. తాజాగా ఆయన యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు ఏవీ వాడనని కేవలం చిన్న మొబైల్‌నే వాడతానని చెప్పాడు.
తర్వాత తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనలయ్యాడు పోసాని. 'మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. తనకు ఎలాంటి చెడ్డ అలవాటు లేకపోయేది. కానీ ఎవడో పేకాట నేర్పాడు. నాన్న పేకాట ఆడటం చూసి ఊళ్లోవాళ్లు ఎందుకు సుబ్బారావు.. ఇలా చేస్తున్నావు? అని విమర్శించారు. దానికి ఆయన సమాధానం చెప్పలేక పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయారు' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: ప్రాజెక్ట్ కేపై ప్రభాస్ షాకింగ్ నిర్ణయం
ఆ హీరోతో 15 ఏళ్ల తర్వాత నటించనున్న త్రిష