
చిత్తూరు, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి సోమవారం యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు కుటుంబసభ్యులతో విచ్చేశారు. ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వారికి ఆలయాధికారులు స్వామి, అమ్మవార్ల జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందజేశారు. వారితో పాటు ఆలయ ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు కండ్రిగ ఉమ,మల్లెమాల ప్రమీలమ్మ,అత్తింజేరి బాలాజీ ఉన్నారు.