కొడవలూరు: (నెల్లూరు): ఆటోలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ భూముల వద్ద బుధవారం జరిగింది. సెవెన్ సీటర్ ఆటోలో వెనుక భాగంలో.. ఉన్న శవాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. శవం పూర్తిగా కాలిపోవడంతో ఆనవాళ్లు తెలియలేదు. ఏపీ 26 సీసీ 6090 నంబరుగల ఆటో నెల్లూరు పట్టణంలోని పొగతోట ప్రాంతంలోని కస్తూరినగర్‌కు చెందిన ఇండ్ల సాయికుమార్‌దిగా పోలీసులు గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.
ఇదిలా ఉండగా.. గూడూరు రూరల్ పరిధిలోని శ్రీవరసిద్ధ వినాయకస్వామి ఆలయం సమీపంలో గుర్తుతెలియని శవాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. పురుషుని ముఖంపై యాసిడ్ పోసినట్లుగా ఉంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయింది. ఎవరో దాడిచేసి హతమార్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాయుడుపేట జాతీయ రహదారి పక్కన ఉన్న పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. గ్రామస్తులు బుధవారం ఉదయం గమనించి పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే సీఐ రత్తయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుణ్ణి ఎక్కడో చంపేసి ఇక్కడికి తెచ్చి పెట్రోల్ పోసి కాల్చివేశారని సీఐ చెప్పారు. మృతదేహం గుర్తుపట్టేందుకు వీలులేకుండా కాలిపోయిందని, శవం వద్ద రెండు క్యాన్లు, సురభి వాటర్ బాటిల్ ఉన్నాయని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఆటోలోనే సజీవ దహనం
Published Wed, Jul 8 2015 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM
Advertisement
Advertisement