
ఓటీటీలు, ఏటీటీలు ఎన్ని ఉన్నా.. మన ఫేవరేట్ హీరో సినిమా థియేటర్లో చూస్తే ఆ మజాయే వేరు.. కానీ కరోనా వచ్చి.. ఆ మజాను మన నుంచిదూరం చేసింది.. ఇప్పుడు ఒకొక్కటి అన్‌లాక్ అవుతున్నాయి.. మరి థియేటర్లు?? ఇంకా తేలనే లేదు.. అటు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో మాత్రం కరోనా భయం లేకుండా.. భౌతిక దూరం కూడా పాటించేలా చూసేందుకు ఇలా డ్రైవ్ ఇన్ సినిమాల బాటన పడ్డారు. చూశారుగా.. ఎవరి కారులో వారు కూర్చుని.. సినిమాను ఎంజాయ్ చేయడమన్నమాట. కొన్ని చోట కుర్చీల సదుపాయం కూడా ఉంది. నాలుగ్గోడల మధ్య వైరస్ వ్యాప్తి ఎక్కువుంటుందనిఅంటున్నారు కాబట్టి.. ఇలాంటి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు భవిష్యత్తులో క్రేజ్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు.