
ఆటగాడితో ఆడుకున్నారు..
గ్రీస్: మందకొడిగా సాగుతున్న ఫుట్ బాల్ మ్యాచ్ మీద నిరాసక్తతో వైద్య సిబ్బంది ఓ ఆటగాడిపై తమ ప్రతాపం చూపించింది. గాయాలైన ఆటగాడు అని కూడా చూడకుండా దురుసుగా వ్యవహరిస్తూ పలుమార్లు స్ట్రెచ్చర్ పైనుంచి కిందపడేశారు. దీంతో గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ కన్నా ఈ సంఘటన ఎక్కువగా ఆసక్తి కలిగించింది. ఈ ఘటన గ్రీక్ సెకండ్ గ్రేడ్ డివిజన్ లీగ్ మ్యాచ్ లో భాగంగా రెండు జట్ల మధ్య శనివారం మ్యాచ్ నడుస్తుండగా చోటు చేసుకుంది.
గాయాల కారణంగా ఆటగాళ్లు నిదానంగా ఆడుతుండటంతో మ్యాచ్ చప్పగా సాగుతోంది. అయితే ఒక ఆటగాడికి మ్యాచ్ మధ్యలో నడుం పట్టేయడంతో.. సహాయం కోరగా గ్రౌండ్లోకొచ్చిన వైద్యసహాయ సిబ్బంది అతన్ని ఎంత తొందరగా పిచ్ బయట వదిలేద్దామా అని ఉరుకులు పరుగులుగా అతన్ని స్ట్రెచ్చర్ పై తీసుకెళ్లారు. అయితే వేగంగా వెళ్లే క్రమంలో ఆటగాన్ని రెండుసార్లు కింద పడేసి, చివరకు పిచ్ బయటకు వచ్చే సరికి స్రెచ్చర్ తో పాటూ అతన్ని కిందపడేశారు.