
ఏథెన్స్ : అమెరికా మహిళా సైంటిస్టును హత్య చేసి అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ గ్రీసు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు నేరం అంగీకరించాడని త్వరలోనే కోర్టులో హాజరుపరుచనున్నట్లు పేర్కొన్నారు. వివరాలు... అమెరికాకు చెందిన సుజానే ఈటన్(59)... మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ డ్రెస్డెన్ యూనివర్సిటీలో మాలిక్యులర్ బయోలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కాన్ఫరెన్సులో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి గ్రీసులోని చనియా సిటీకి వెళ్లారు. అయితే జూలై 2 నుంచి సుజానే కనిపించకుండా పోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో సుజానే ఆచూకీ కోసం వెదుకుతున్న క్రమంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఓ బంకర్‌లో ఓ మహిళ శవం ఉందంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అది సుజానే బాడీ అని గుర్తించారు. ఈ క్రమంలో లోతుగా విచారణ జరుపగా... చనియాకు చెందిన ఓ యువరైతు ఆమెను చంపినట్లుగా తేలింది. సుజానేను తొలుత కారుతో తొక్కించి..ఆమె మరణించిన తర్వాత శవంపై నిందితుడు అత్యాచారం జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా అతడు నేరం అంగీకరించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment