
గ్రీస్‌లో భారీ భూకంపం
గ్రీస్: గ్రీస్ ద్వీపాన్ని శుక్రవారం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో ఇద్దరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. గ్రీస్‌లోని కోస్ ఐలాండ్‌కు చేరువగా భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూకంప తీవ్రత 6.5గా తెలిపారు.
భూకంప ధాటికి వందల కొద్ది భవనాలు కోస్‌లో నేలకొరిగాయి. ముఖ్యంగా కోస్ నగరం దెబ్బతింది. మిగతా ప్రదేశాల్లో జరిగిన నష్టం తక్కువగానే ఉంది. రంగంలోకి దిగిన గ్రీస్ పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్ధ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు.