ఈసారి 450మందిని మింగేసింది | At Least 700 People On Board Capsized Boat Off Greece | Sakshi
Sakshi News home page

ఈసారి 450మందిని మింగేసింది

Published Fri, Jun 3 2016 3:47 PM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

ఈసారి 450మందిని మింగేసింది - Sakshi

ఈసారి 450మందిని మింగేసింది

జెనీవా/స్విట్జర్లాండ్: గ్రీస్ సముద్ర జలాల్లో మరో భారీ విషాదం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిలో సగానికిపైగా జలసమాధి అయినట్లు తెలుస్తోంది. సిరియా యుద్ధ భయంతో ఆ దేశానికి చెందిన ప్రజలంతా శరణార్థులుగా సమీప దేశాలకు ప్రాణభయంతో సముద్రాల మీదుగా వెళ్తున్న విషయం తెలిసిందే. అది కూడా పరిమితిమించిన సంఖ్యతో.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం గ్రీక్ ద్వీపంలోని తీరంలో 700 మందితో వస్తున్న పెద్ద నౌక ఒకటి అనూహ్యంగా మునిగిపోయినట్లు శరణార్థుల ప్రపంచ సంస్థ ఒకటి వెల్లడించింది. కాగా, వీరిలో 250మందిని రక్షించినట్లు సమాచారం. మిగితా వందల సంఖ్యలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్కరు బతికి ఉన్నట్లు అధికారులు చెప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement