
మన గురువులది ఏ స్థానం...
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ... అని తల్లిదండ్రులు, గురువులకు ప్రథమస్థానం ఇచ్చింది హైందవ సాంప్రదాయం.
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ... అని తల్లిదండ్రులు, గురువులకు ప్రథమస్థానం ఇచ్చింది హైందవ సాంప్రదాయం. దురదృష్టవశాత్తు భారతదేశం ఈ మూడు విషయాలలోనూ వెనకబడే ఉంది. ఇందుకు సినిమాలు కొంతవరకు కారణం అనడంలో సందేహం లేదు. ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన పొరుగు దేశమైన చైనా... గురువులను గౌరవించే సాంప్రదాయంలో ప్రథమస్థానంలో ఉంది. అత్యధిక జనాభా గల దేశంగా మొదటి స్థానంలో ఉన్న చైనా గురువుల విషయంలో ముందుండటాన్ని ప్రశంసించాల్సిందే.
వార్కే జెమ్‌స ఫౌండేషన్ (జార్జి ఎడ్యుకేషనల్ మెడికల్ అండ్ చారిటబుల్ సొసైటీ)... 21 దేశాలలో గురువులకు సంబంధించి నిర్వహించిన సర్వేలో చైనా ప్రథమస్థానం దక్కించుకుంది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్న యునెటైడ్ కింగ్‌డమ్ మాత్రం 10 వ స్థానంలో ఉంది. ప్రతి దేశంలోనూ 1000 మంది విజ్ఞులు ఈ సర్వేలో పాల్గొన్నారు. చైనాలో విద్యార్థులు మాత్రం టీచింగ్ ప్రొఫెషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ‘‘గురువులకే అత్యధిక గౌరవం దక్కుతుంది’’ అంటున్నారు ససెక్‌స యూనివర్సిటీ, ఎకనామిక్‌స ప్రొఫెసర్ అయిన డాల్టాన్.
యునెటైడ్ కింగ్‌డమ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే గురువును గౌరవిస్తున్నారు. చైనాలో గురువులను వైద్యులతో సమానంగా భావిస్తారు. యుకేలో మాత్రం నర్సులుగాను, సంఘసంస్కర్తలుగాను భావిస్తారు. అమెరికాలోనైతే గురువులు లైబ్రేరియన్లతో సమానం. జపాన్‌లో గురువులంటే స్థానిక ప్రభుత్వోద్యోగుల కింద లెక్క. పబ్లిక్ స్టాటస్ ఆఫ్ టీచింగ్ అనేది విద్య ప్రామాణికతను పెంచుతుంది అన్నారు ప్రొఫెసర్ డాల్టన్.
గురువులకు గౌరవం దక్కే విషయంలో మొదటి పది స్థానాలలో ఉన్న దేశాలు...
చైనా, గ్రీస్, టర్కీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఈజిప్టు, సింగపూర్, నెదర్లాండ్‌స, యుఎస్‌ఏ, యుకే
జగద్గురువులు జన్మించిన భారదదేశం మొదటి పది స్థానాలలోనూ చోటు దక్కించుకోకపోవడం నిజంగా సిగ్గు పడాల్సిన విషయమే.