ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి.. అక్కడ మనం నివసించాలంటే.. మనమే ఎంతకొంత అద్దె కట్టాల్సి ఉంటుంది. కానీ, మీరు వచ్చి మా ద్వీపంలో నివసిస్తే చాలు.. బదులుగా మేమే మీకు నెలకు రూ. 40వేలు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తోంది ఓ దేశం. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపానికి వెళ్లి నివసిస్తే.. నెలకు 450 పౌండ్లు (రూ. 40వేలు) అక్కడి స్థానిక ప్రభుత్వం చెల్లించనుంది. ఈ ద్వీపంలో నివసించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మధ్యధర సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య అంటీకైథెరా ద్వీపం ఉంది. ప్రస్తుతం ఈ ద్వీపంలో 24మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవికాలం వస్తే ఇక్కడ నివసించే వారి సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. అంతగా ఆధునీకరించని ఈ చిన్నీ నివాసయోగ్యమైన ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుందని, అయితే, అపారమైన విశ్రాంతి, విహారాలకు ఈ ద్వీపం నెలవని అంటీకైథెరా అధికారిక వెబ్‌సైట్ పేర్కొంటుంది. శీతకాలంలో తమ ద్వీపం ఎంతో అందంగా ఉంటుందని, ఆ సమయంలో ఇక్కడ గడపడం కొంచెం కష్టమైనా.. ఎక్కువ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసించాలని, మళ్లీ ఈ ద్వీపం పునర్‌వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు ద్వీపం మేయర్ స్థానిక మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment