Greek island
-
అక్కడికి వెళితే నెలకు 40వేలు ఇస్తారు!
ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లి.. అక్కడ మనం నివసించాలంటే.. మనమే ఎంతకొంత అద్దె కట్టాల్సి ఉంటుంది. కానీ, మీరు వచ్చి మా ద్వీపంలో నివసిస్తే చాలు.. బదులుగా మేమే మీకు నెలకు రూ. 40వేలు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తోంది ఓ దేశం. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. గ్రీస్ దేశంలోని అంటీకైథెరా ద్వీపానికి వెళ్లి నివసిస్తే.. నెలకు 450 పౌండ్లు (రూ. 40వేలు) అక్కడి స్థానిక ప్రభుత్వం చెల్లించనుంది. ఈ ద్వీపంలో నివసించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యధర సముద్రంలోని క్రెటా, కైథిరా దీవుల మధ్య అంటీకైథెరా ద్వీపం ఉంది. ప్రస్తుతం ఈ ద్వీపంలో 24మంది మాత్రమే నివసిస్తున్నారు. వేసవికాలం వస్తే ఇక్కడ నివసించే వారి సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. అంతగా ఆధునీకరించని ఈ చిన్నీ నివాసయోగ్యమైన ద్వీపంలో ఆహారం తక్కువగా దొరుకుతుందని, అయితే, అపారమైన విశ్రాంతి, విహారాలకు ఈ ద్వీపం నెలవని అంటీకైథెరా అధికారిక వెబ్సైట్ పేర్కొంటుంది. శీతకాలంలో తమ ద్వీపం ఎంతో అందంగా ఉంటుందని, ఆ సమయంలో ఇక్కడ గడపడం కొంచెం కష్టమైనా.. ఎక్కువ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివసించాలని, మళ్లీ ఈ ద్వీపం పునర్వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు ద్వీపం మేయర్ స్థానిక మీడియాకు తెలిపారు. -
పిల్లులంటే ఇష్టమా?.. అయితే ఈ వార్త చదవాల్సిందే!
వీలైతే ప్రేమించండి... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమించడానికి మనుషులే అవసరం లేదు. కొందరు జంతువుల్ని కూడా ప్రేమిస్తారు. జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే జంతు ప్రేమికులకు ఓ శుభవార్త.. అందులోనూ పిల్లులను ఇష్టపడే వ్యక్తులకు మరింత పనికొచ్చే వార్త. జోన్ బోవెల్ 2010 నుంచి పిల్లుల్ని పెంచుతూ ఉంది. డెన్మార్క్‌కు చెందిన ఈమె ఓ యాభై పిల్లుల్ని పెంచుతూ తన ఇంటినే సాంక్చుయరీలా మార్చేసింది. అయితే తన ఆరోగ్యరిత్యా వేరేచోటుకు మారాల్సివచ్చింది. అయితే తను లేకపోతే సాంక్చుయరీ ఏమైపోతుందో అని బాధపడుతూ.. ఆ పిల్లుల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలంటూ.. ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘ఎవరికైనా పిల్లులంటే ఇష్టముంటే, జంతు ప్రేమికులైతే.. మమల్ని సంపద్రించండి. ఇది సరదా కోసం చేసింది కాదు. మా సాంక్చుయరీని రక్షిస్తూ.. ఇక్కడ ఉండే పిల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి గానూ ఉండడానికి ఇళ్లు, జీతం ఇస్తామం’టూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అయితే దీనికి గాను కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. వయసు 45 ఏళ్లకు పైబడి ఉంటే బాగుంటుందని, మొదటి ఆరు నెలలు వాలంటీర్‌గా పనిచేయాలని తెలిపారు. ఆసక్తి గలవారు joanbowell@yahoo.com ఈ అడ్రస్‌కు అప్లికేషన్‌తో పాటు ఫోటోను జతచేసి పంపాలని పేర్కొన్నారు. వచ్చిన అప్లికేషన్స్‌లో నచ్చిన వాటిని తీసుకుని ఆగస్టు చివరికల్లా స్కైప్‌లో కాల్ చేసి మాట్లాడతామని తెలిపారు. -
ఆ విమానం ఉగ్రవాదులే కూల్చారా?
కైరో: ప్యారిస్ నుంచి కైరోకు బయలుదేరిన విమానం కూలిపోయినట్లు ప్యారిస్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రమాదానికి గల ఏ కారణాన్ని కూడా అంతతేలిగ్గా కొట్టిపారేయలేమని చెప్పారు. తమ దృష్టి అంతా ఆ విమానంలో ప్రయాణించి కనిపించకుండా పోయినవారి కుటుంబాల గురించేనని.. తర్వాతే అసలైన కారణాల గురించి తీవ్రంగా ఆలోచిస్తామని చెప్పారు. ఉగ్రవాదులు కూడా కూల్చివేసి ఉండొచ్చేమోనన్న అనుమానాలు తీసిపారేయలేమని చెప్పారు. ప్యారిస్ నుంచి కైరో నగరానికి బయలు దేరిన ఈజిప్టు ఎంఎస్ 804 విమానానికి గ్రీకు ద్వీపానికి సమీపంలో ఏవియేషన్ సంస్థతో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానం దాదాపు 32 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుందని అధికారులు తెలిపారు. అయితే, చివరకు అది కూలిపోయినట్లు తెలిసింది. ఈ విమానం కోసం మొత్తం మూడు దేశాలు ఇప్పటికే ముమ్మరంగా గాలింపులు ప్రారంభించారు. కాగా, ఏవియేషన్ నిపుణులు ఈ ప్రమాదానికి ఉగ్రవాద దాడి అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. కాగా, విమానాశ్రయంలో తగిన తనిఖీలు చేయలేదని కారణంతో ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. -
సముద్రంలో కూలిన ఈజిప్టు విమానం
కైరో: అదృశ్యమైన ఈజిప్టు విమానం సముద్రంలో కూలిపోయింది. ఈజిప్టు గగనతలంలో గ్రీకు ద్వీపం సమీపంలో విమానం కూలినట్టు గ్రీక్ విమానయాన శాఖ అధికారులు చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉందని ఈజిప్టు తెలిపారు. విమానంలో 59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రాడార్ సంకేతాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.