ఆ విమానం ఉగ్రవాదులే కూల్చారా?
కైరో: ప్యారిస్ నుంచి కైరోకు బయలుదేరిన విమానం కూలిపోయినట్లు ప్యారిస్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రమాదానికి గల ఏ కారణాన్ని కూడా అంతతేలిగ్గా కొట్టిపారేయలేమని చెప్పారు. తమ దృష్టి అంతా ఆ విమానంలో ప్రయాణించి కనిపించకుండా పోయినవారి కుటుంబాల గురించేనని.. తర్వాతే అసలైన కారణాల గురించి తీవ్రంగా ఆలోచిస్తామని చెప్పారు. ఉగ్రవాదులు కూడా కూల్చివేసి ఉండొచ్చేమోనన్న అనుమానాలు తీసిపారేయలేమని చెప్పారు.
ప్యారిస్ నుంచి కైరో నగరానికి బయలు దేరిన ఈజిప్టు ఎంఎస్ 804 విమానానికి గ్రీకు ద్వీపానికి సమీపంలో ఏవియేషన్ సంస్థతో సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో విమానం దాదాపు 32 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుందని అధికారులు తెలిపారు. అయితే, చివరకు అది కూలిపోయినట్లు తెలిసింది. ఈ విమానం కోసం మొత్తం మూడు దేశాలు ఇప్పటికే ముమ్మరంగా గాలింపులు ప్రారంభించారు. కాగా, ఏవియేషన్ నిపుణులు ఈ ప్రమాదానికి ఉగ్రవాద దాడి అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. కాగా, విమానాశ్రయంలో తగిన తనిఖీలు చేయలేదని కారణంతో ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.