సముద్రంలో కూలిన ఈజిప్టు విమానం
కైరో: అదృశ్యమైన ఈజిప్టు విమానం సముద్రంలో కూలిపోయింది. ఈజిప్టు గగనతలంలో గ్రీకు ద్వీపం సమీపంలో విమానం కూలినట్టు గ్రీక్ విమానయాన శాఖ అధికారులు చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉందని ఈజిప్టు తెలిపారు. విమానంలో 59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రాడార్ సంకేతాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.