
టోక్యో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఆందోళన నేపథ్యంలో ఒలింపిక్ జ్యోతి శుక్రవారం జపాన్‌కు చేరింది. ఏథెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ జ్యోతిని టోక్యో 2020 నిర్వాహకులకు గ్రీస్ అప్పగించింది. వేడుకగా జరగాల్సిన ఈ కార్యక్రమం కరోనా వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు లేకుండానే ముగించారు. ఈ కార్యక్రమంలో గ్రీస్ ఒలింపిక్ కమిటీ చీఫ్ స్పైరోస్ కాప్రలోస్ చేతుల మీదుగా జ్యోతిని టోక్యో గేమ్స్ ప్రతినిధి నవోకో ఇమోటో అందుకున్నారు.
కరోనా ఉదృతి నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహించాలా వద్దా అనేది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జపాన్‌కు చెందిన ప్రసిద్ధ క్రీడాకారులు సౌరి యోషిడా, తదాదాహిరో నోమురాలు జ్యోతిని అందుకొని.. నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీకి అప్పగించారు. మార్చి 26వరకు ఒలింపిక్ జ్యోతిని ఉత్తర జపాన్‌లో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment