బీజింగ్:చైనా, గ్రీస్, టర్కీ దేశాల్లోని పలు ప్రాంతాల ప్రజలను శనివారం భూకంపాలు వణికించాయి. నైరుతి చైనాలోని ఇంగ్‌జియాంగ్ కౌంటీలో ఉదయం రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. పలు పట్టణాల్లో 9,412 ఇళ్లు, రోడ్లు ధ్వంసం కాగా 12 మంది గాయపడ్డారు. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప కేంద్రం 12 కి.మీ. లోతులో ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా శనివారం మధ్యాహ్నం గ్రీస్, టర్కీ తీరాల వద్ద సముద్రంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర గ్రీస్, పశ్చిమ టర్కీలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. వేలాది మంది ప్రజలు భయకంపితులయ్యారు. టర్కీలోని ఓ దీవితోపాటు వివిధ చోట్ల 266కు పైగా మంది గాయపడ్డారు. థెసాలోనికాకు 210 కి.మీ. దూరంలో సముద్రంలో 10 కి.మీ. లోతులో ఈ భూకంపం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
చైనా, గ్రీస్, టర్కీలలో భూకంపాలు
Published Sun, May 25 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement