Spinal
-
వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..?
ఈ రోజుల్లో వెన్ను నొప్పి అత్యంత సర్వసాధారణం. కంప్యూటర్ల ముందు గంటలకొద్ది కూర్చొని చేసే ఉద్యోగాలు కావడంతో ప్రతి ఒక్కరూ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇవి ఎక్కువైపోయాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యనే ఎదుర్కొంటున్నారు. అయితే ఇది కాల్షియం లోపం వల్లనో లేక కూర్చొనే భంగిమ తేడా వల్లనో అని తేలిగ్గా తీసుకుంటే మాత్రం అసలుకే తేడా వచ్చి ప్రాణాంతకంగా మారిపోతున్న కేసులు కోకొల్లలు. ఇవాళ ప్రపంచ వెనుముక దినోత్సవం పురుస్కరించుకుని అసలు ఇలాంటి సమస్యని ఎలా గుర్తించగలం? అందుకు చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలేంటో సవివరంగా నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా..!.వెన్నుముక సమస్యలు లేదా తరచుగా వెన్నునొప్పి వేధిస్తుంటే తక్షణమే వైద్యుని సంప్రదించి ఎక్స్‌రే, ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌లు తప్పనిసరిగా తీయించుకోవాలి.అలాగు వీటి తోపాటు పెట్ సీటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడు వెన్నుముక కణితులు వెన్నుపాము వెలుపల ఉన్నాయా..? దాని లోపలే ఉన్నాయా అనేది నిర్థారించాల్సి ఉంటుంది. వెన్నుముక కేన్సర్ లక్షణాలు..వెనుముకలోనే కేన్సర్ కణితులు ఉన్నట్లయితే ఎముక నిర్మాణ విస్తరించడం లేదా బలహీనపడటం జరుగుతుంది. అలాగే వెన్నుముక నరాలు కుదింపుకు గురై నొప్పి కలిగించొచ్చు.వెన్నుముక అస్థిరత వంటి కారణంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి క్రమంగా ప్రారంభమై కాలక్రమేణ తీవ్రమవుతుంది. విశ్రాంతితో సెట్ కాదు. పైగా రాత్రి సమయాల్లో మరింత తీవ్రమవుతుంది. అలాగే ఎగువ లేదా దిగువ భాగంలో షాక్‌లాంటి నొప్పిన కలిగిస్తాయి. కండరాల బలహీనతతిమ్మిరిజలదరింపుఉష్ణోగ్రత సంచలనంమూత్రాశయం లేదా ప్రేగు నియంత్రణ కోల్పోవడంలైంగికంగా బలహీనం కావడంనడవడంలోనూ సమస్యఎలా నిర్థారిస్తారంటే..వెనుముక కణితిని నిర్థారించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. వెన్నుముక కదలికలు గురించి తెలుసుకోవడానికి నరాల ద్వారా పరీక్ష చేసి గుర్తిస్తారు. వీటి తోపాటు కొన్ని ఇతర పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.రక్త పరీక్షలువెన్నెముక అమరికలుమూత్ర పరీక్షలుమాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లేదా ఎంఆర్ఐమాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ లేదా ఎంఆర్ఎస్సింగిల్-ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ లేదా స్పెక్ట్యాంజియోగ్రఫీమాగ్నెటెన్సెఫలోగ్రఫీకణజాల బయాప్సీలు(చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
అత్యంత అరుదైన వ్యాధి..మెడిసిన్ ఖర్చే ఏకంగా రూ. 17 కోట్లు!
అత్యంత అరుదైన వ్యాధులు చాలానే ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్నింటికి చికిత్స లేకపోగ, మరికొన్నిటికి చికిత్సకు అయ్యే ఖర్చు చూస్తే అసలు సామాన్యుడు కాదు కదా ధనవంతుడైన ఖర్చుపెట్టలేనంతగా ఖరీదుగా ఉంటుంది. ఇక మరొకొన్నిటికి అసలు చికిత్స అనేది ఉండదు. అలాంటి అత్యంత ఖరీదైన వైద్యంతో కూడిన అరుదైన వ్యాధి బారిన పడ్డాడు ఓ చిన్నారి. అతడికోసం ముఖ్యమంత్రి కదిలివచ్చి పరామర్శించడమే గాక అత్యంత ఖరీదైన మెడిసిన్‌ను అందజేశారు. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు ఏడాదిన్నర చిన్నారి. అతడి పరిస్థితిని చూసి చలించిన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ చిన్నారిని పరామర్శించి చికిత్సలేని ఆ వ్యాధికి ఇచ్చే అత్యంత ఖరీదైన మందును ఆయనే స్వయంగా అందజేశారు. ఆ డ్రగ్ ఖరీదు ఏకంగా రూ. 17.5 కోట్లు. అని చెప్పారు. ఇంతకీ అసలు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుందంటే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే వెన్నెముక కండరాల క్షీణత(ఎస్ఎంఏ). దీని వల్ల వెన్నుపాములోని మోటారు న్యూరాన్లను కోల్పోతుంది. దీంతో కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీన్ని జన్యు నాడీ కండరాల రుగ్మత అని కూడా పిలుస్తారు. ఈ మేరకు ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీకి చెందిన అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ నంద్వానీ మాట్లాడుతూ..భారతదేశంలో ఎస్ఎంఏ అనేది చాలా అరుదు. ఇది వస్తే మాత్రం గణనీయమైన ప్రభావం ఉంటుంది. ప్రతి ఏడు వేల మంది జననాలలో మూడు వేలమంది శిశువులు దీని భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా పక్షవాతం వచ్చి క్రమంగా ఆరోగ్యం క్షీణిచడం తోపాటు మిగతా అవయవాలపై దీని ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు. చికిత్స: దీనికి పూర్తి నివారణ లేదు. వెన్నుముక కండరాల క్షీణత కారణమైన జన్యవులను ప్రభావితం చేసేలా చికిత్స అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడం వంటివి మాత్రమే చేయగలం అని తెలిపారు. దీని కోసం జోల్జెన్స్మా అనే జన్యు పునఃస్థాపన చికిత్స తోపాటు న్యూసినెర్సెన్ (స్పిన్రాజా), రిస్డిప్లామ్ (ఎవిర్స్డ్) అనే రెండు మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాధిత కుటుంబాల జన్యు క్రమాన్ని అధ్యయనం చేసి తత్ఫలితంగా చికిత్స అందించేలా వైద్య విధానాలు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. (చదవండి: మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!) -
40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే..
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్.బి.ఐ అధికారులకి ఒక విచిత్రమైన కేసు ఎదురైంది. కెంటక్కీలోని ఒక వ్యక్తి మీద అనుమానంతో అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా నేను, నాతో పాటు చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఇంటి లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు చక్కగా అలంకరించి ఉన్నాయి. దీంతో అధికారులు అతడిని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల హార్వార్డ్ మెడికల్ స్కూల్ శవాగారం నుండి చాలా వరకు మృతదేహాల అవశేషాలు దొంగిలించబడుతున్నాయని ఎఫ్.బి.ఐకి ఫిర్యాదు చేశారు సదరు స్కూలు సిబ్బంది. అప్పటి నుండి కేసు దర్యాప్తు చేసున్న ఎఫ్.బి.ఐ అధికారులకు కెంటక్కీకి చెందిన జేమ్స్ నాట్(39) పై అనుమానం వచ్చింది. పోలీసులు అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని విచిత్రమైన సమాధానమిచ్చాడట. ఇంకేముంది పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి నిండా ఎక్కడ చూసినా ఆస్తిపంజరాలు, పుర్రెలే. ఫర్నీచర్ చుట్టూ మానవ అవశేషాలను చక్కగా అలంకరించుకున్నాడట జేమ్స్. ఒక హార్వార్డ్ స్కూలుకు సంబంధించిన బ్యాగ్ కూడా అక్కడ దొరకడంతో తాము వెతుకుతున్న నేరస్తులలో జేమ్స్ ఉండి ఉంటాడని అనుమానంతో దర్యాప్తు చేశారు అధికారులు. తీగలాగితే.. జేమ్స్ నాట్ ఇల్లంతా తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు దొరికాయి. అతడి పేస్ బుక్ మెసేజులన్నీ పరిశీలించగా అతడు జెరెమి పాలీ అనే వ్యక్తితో మానవ అవశేషాల కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు నడుపుతున్న విషయం బయటపడింది. ఇంటిలో కొన్ని మారణాయుధాలు కూడా దొరకడంతో అక్రమ్మగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతోనూ, నిషేధిత వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న నేరం కింద జేమ్స్ నాట్ ని అరెస్టు చేశారు. జెరెమి పాలీ కోసం గాలిస్తున్నారు. జెరెమి పాలీ, జేమ్స్ నాట్ వీరంతా మానవ అవశేషాలను విక్రయించే ముఠాకు చెందిన వారిని.. వీరు శరీరంలోని ఎముకల తోపాటు చర్మాన్ని కూడా అమ్ముకుంటారని తెలిపారు ఎఫ్.బి.ఐ అధికారులు. ఇది కూడా చదవండి: భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక.. -
Anantapur: పసివాడి చికిత్సకు రూ.16 కోట్లు!
సాక్షి, అనంతపురం/నార్పల: అరుదైన వ్యాధి.. ఓ పేద కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి అనే జబ్బు వల్ల పెద్ద కుమారుడు దూరమవడం.. చిన్న కుమారుడూ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లకే రూ.16 కోట్లు అవసరం కావడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడగా.. పలు స్వచ్చంద సంస్థలు వారికి బాసటగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నాయి. అనంతపురం జిల్లా నార్పలకు చెందిన జేసీబీ డ్రైవర్ రాజు, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫి సోకి పెద్ద కుమారుడు భరత్(6) కొంతకాలం కిందట మృతి చెందగా.. ఇప్పుడు రెండో కుమారుడు ధనుష్(2)కు కూడా ఆ వ్యాధి సోకింది. ఎంజైముల లోపంతో... దీనిని జన్యుపరంగా సోకే వ్యాధిగా గుర్తించారు. పెద్ద కుమారుడు భరత్‌కు అనారోగ్య సమస్య కొనసాగుతుండగానే.. రెండో కుమారుడు ధనుష్ 2020 సెప్టెంబర్‌లో జన్మించాడు. 5 నెలల వయసులోనే వ్యాధి లక్షణాలు గుర్తించిన తల్లిదండ్రులు డాక్టర్లను కలిశారు. ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని నాలుగు రకాల అట్రోఫిలు ఉంటాయి. ఎంజైము లోపంతో వచ్చే వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. మెదడు, వెన్నుపూస సరిగ్గానే ఉన్నా.. కండరాలు పనిచేయకపోవడంతో రోజురోజుకూ అవి బలహీనపడుతూ చివరకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ప్రస్తుతం ధనుష్‌కు టైప్ 2 సోకగా.. బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ఈ జబ్బుకు ఇటీవలే అమెరికాలో మందు కనిపెట్టారని.. ఇది సత్ఫలితాలనిస్తోందని ఆ ఆస్పత్రి వైద్యులతో పాటు వెన్నుపూస వైద్య నిపుణుడు డాక్టర్ జె.నరేష్‌బాబు చెప్పారు. జోల్గెన్స్మా అనే ఇంజక్షన్‌ను సరైన సమయంలో ఇస్తే ప్రాణాలను కాపాడవచ్చని.. దీని ధరను అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ 1.79 మిలియన్ యూరోలు(రూ.16 కోట్లు)గా నిర్ణయించిందని తెలిపారు. కుమారుడిని దక్కించుకోవాలంటే రూ.16 కోట్లు కావాలని తెలియడంతో రాజు దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. చికిత్సకు ముందుకొచ్చిన సంస్థలు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ధనుష్‌కు అండగా ఉండేందుకు పలు స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చాయి. ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్ ఆఫ్ ఇండియా సంస్థ ఇంజక్షన్లకయ్యే రూ.16 కోట్లు వెచ్చిస్తానని ప్రకటించింది. ఇలాంటి జబ్బుతోనే మరణించిన చిన్నారుల తల్లిదండ్రులంతా కలిసి నెలకొల్పిన క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఫౌండేషన్, ఇంపాక్ట్ గురు అనే సంస్థలు వైద్యానికి, ఇతర ఖర్చులకు ఆర్థిక సాయం భరించేందుకు ముందుకొచ్చాయని ధనుష్ తల్లిదండ్రులు రాజు, అరుణ చెప్పారు. ఆ సంస్థల మేలు ఎప్పటికీ మరవలేమంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. -
స్పైనల్ కౌన్సెలింగ్
వెన్నునొప్పి తగ్గడం లేదు... ఏం చేయాలి? నా వయసు 29 ఏళ్లు. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. మా ఇంటి నుంచి ఆఫీసు చేరడానికి నేను కనీసం రోజూ 40 కి.మీ. బైక్ మీద వెళ్తుంటాను. ఆఫీసులో అంతా డెస్క్ పనే. నాకు మూడు నెలల క్రితం తీవ్రమైన వెన్నునొప్పి వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌కు చూపించుకున్నాను. మందులు రాసిచ్చారు. ఒక వారం పాటు వాడాను. నొప్పి తగ్గింది. ఈమధ్య ఒక వారం రోజుల నుంచి వెన్నుతో పాటు మెడ భాగంలో కూడా తీవ్రమైన నొప్పి వస్తోంది. దయచేసి నా సమస్య ఏమిటో చెప్పి, తగిన పరిష్కారం సూచించండి. – వరుణ్, హైదరాబాద్ ఈమధ్య వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిలో ఈ వెన్నునొప్పులు సాధారణమైపోయాయి. చిన్నవయసులోనే ఈ నొప్పి బారిన పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఇక మీ సమస్య విషయానికి వస్తే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీరు టూ–వీలర్ మీద చాలా లాంగ్ డ్రైవింగ్ చేయడం. మీ ఇంటి నుంచి మీరు పనిచేసే ప్రదేశానికి 35 కి.మీ. అన్నారు. అంటే రానూపోనూ సుమారు 70 కి.మీ. దూరం మీరు ప్రయాణం చేస్తున్నారు. అందునా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య, రోడ్డు మీద ఉండే గతుకుల మధ్య ఇంత దూరం టూ–వీలర్‌పై ప్రయాణం చేయడం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏకధాటిగా అంతసేపు మీరు బైక్ మీద ప్రయాణం చేయడం వల్ల మీ వెన్ను (స్పైన్) తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఇక రెండో విషయానికి వస్తే ఒకే భంగిమలో అదేపనిగా కొన్ని గంటలపాటు కూర్చొని పనిచేయడం వల్ల కూడా మీ వెన్ను తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అంతేకాకుండా కంప్యూటర్ మీద అన్ని గంటలు పనిచేయడం వల్ల కూడా మీకు వెన్నుతో పాటు మెడ నొప్పి కూడా వస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న సీనియర్ స్పైన్ సర్జన్‌ను కలవండి. వారు కొన్ని పరీక్షలు చేయించి, వాటిని బట్టి మీ సమస్యకు తగిన పరిష్కారం వారు సూచిస్తారు. అయితే ఈలోగా మీరు ఈ కింద పేర్కొన్న కొన్ని సూచనలు పాటించండి. ♦ మీ సీటుకు ముందు భాగాన ఉండే కంప్యూటర్ డెస్క్‌ను మీ తలకు సమానంగా ఉండేలా అమర్చుకోండి. దానికి అనుగుణంగా ఉండేలా మీరు ఆఫీసులో కూర్చునే భంగిమ మార్చుకోండి. ♦ కొన్ని సాధారణ వార్మ్అప్ వ్యాయామాలు చేయండి ♦ వెన్ను, మెడ తీవ్రమైన ఒత్తిడికి, వేగవంతమైన కదలికలకు గురికాకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. స్పైన్‌కు రెండోసారి సర్జరీ అంటున్నారు... ప్రమాదమా? నేను రెండేళ్ల క్రితం నా వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్నాను. అయితే ఇప్పుడు నాకు విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. ఇక నేను ఎంతమాత్రమూ నడవలేకపోతున్నాను కూడా. మా డాక్టర్‌ను సంప్రదిస్తే, మరోమారు వెన్ను ఆపరేషన్ చేయించాలని అంటున్నారు. దాంతో నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా ఇవ్వండి. – సూర్యనారాయణమూర్తి, కాకినాడ సాధారణంగా వెన్ను ఆపరేషన్లలో రెండోసారి చేయించాల్సి రావడం తరచూ జరుగుతుండే విషయమే. లేదా చేసిన ఆపరేషన్‌ను మరోమారు సమీక్షించుకోవాల్సి రావడం కూడా జరిగేదే. ఇలా రెండోసారి ఆపరేషన్‌కు దారితీసేందుకు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు డిస్క్ పక్కకు తొలగడం, ఇన్ఫెక్షన్ రావడం, సూడోఆర్థోసిస్ వంటి ఎన్నో సందర్భాల్లో చేసిన ఆపరేషన్‌ను మరోమారు సరిదిద్ది, పునఃసమీక్షించుకోవడం అవసరమవుతుంది. అయితే ఆపరేషన్ జరిగే ప్రదేశం అత్యంత కీలకమైన ‘వెన్నెముక’కు కాబట్టి, పైగా ఇది రెండోసారి ఆపరేషన్ కాబట్టి మీరు నిపుణులైన సర్జన్లతోనే దీన్ని చేయించుకోవాలి. స్పర్శ తగ్గుతోంది... మూత్రంపై అదుపు తప్పుతోంది! ఇటీవల నా చేతుల్లో క్రమంగా స్పర్శ తగ్గుతోంది. కాళ్లు బిగుసుకుపోయినట్లుగా మారుతున్నాయి. మెడనొప్పి కూడా వస్తోంది. మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో దాన్ని ఆపుకోవడం చాలా కష్టమవుతోంది. పైగా నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కూడా తప్పుతోంది. నా సమస్యలకు పరిష్కారం చెప్పండి. – ఎల్. రామ్మోహన్రావు, విజయవాడ మీరు చెప్పినదాని ప్రకారం మీరు ‘సర్వైకల్ మైలోపతి’ అనే సమస్యతో బాధపడుతున్నారనిపిస్తోంది. మెడ భాగంలోని వెన్నునరాలపై పడే ఒత్తిడి కారణంగా మీరు చెప్పిన లక్షణాలు మీలో కనిపిస్తున్నాయని లక్షణాలను బట్టి ప్రాథమికంగా నా అభిప్రాయం. అయితే వ్యాధినిర్ధారణ కోసం ఒక క్రమపద్ధతిలో క్లినికల్ పరీక్షలు, ఎమ్మారై వంటి పరీక్షలు చేసి దీన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చిన కండిషన్ ‘సర్వైకల్ మైలోపతి’ అని నిర్ధారణ అయితే, ఆ వ్యాధి తీవ్రత ఆధారంగా మీకు మెడ ముందు భాగం నుంచి గానీ లేదా మెడ వెనకభాగం నుంచిగానీ శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. ముందుగా మీరు మీకు దగ్గర్లోని వైద్యనిపుణులను సంప్రదించి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఆ ఫలితాలను బట్టి మున్ముందు అవసరమైన చికిత్స నిర్ణయించవచ్చు. – డాక్టర్ జి. వేణుగోపాల్, సీనియర్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
మండూకాసనం
ఎలా చేయాలంటే..? మండూకం అంటే కప్ప. ఈ ఆసన స్థితిలో దేహం కప్పను పోలి ఉంటుంది. కొద్దిపాటి తేడాలతో మండూకం ఆకారాన్ని తలపించే ఆసనాలు నాలుగు వరకు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మనం చూస్తున్న విధానం ఒకటి. వెన్నెముక నిటారుగా ఉంచి వజ్రాసన స్థితి (మొదటి ఫొటోలో ఉన్నట్లు) లో కూర్చుని, రెండు అరచేతులను తొడల మీద బోర్లించి ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను ఇరువైపులకు వీలైనంత దూరంగా చాపాలి. ఈ స్థితిలో రెండు చేతులూ మోకాళ్ల పైన ఉండాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు రెండు అరచేతులను వెల్లకిలా తిప్పి బొటనవేలి చివరి భాగాన్ని చూపుడువేలు చివరి భాగాన్ని కలిపి మిగిలిన మూడు వేళ్లనూ నిటారుగా (మూడో ఫొటోలో ఉన్నట్లు) చాపాలి. దీనిని చిన్మయ ముద్ర అంటారు. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఏకాగ్రత ఆసనస్థితి మీదనే ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి రావాలి. ఇలా రోజుకు మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. ఈ ఆసనాన్ని ఏ సమయంలోనైనా సాధన చేయవచ్చు. ఉపయోగాలు గర్భకోశ సంబంధ వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. గర్భిణిగా ఉన్నప్పుడు సాధన చేస్తే సుఖప్రసవం సాధ్యమవుతుంది. గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు. మహిళలకు రజస్వల, రుతు సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. మగవారిలో వీర్యం రక్షింపబడి స్వప్నదోషాలు, మూత్రదోషాలు తొలగిపోతాయి. హెర్నియా సమస్య పోతుంది. మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. నడుము ప్రదేశంలోని దేహభాగాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. పిరుదులలోని కొవ్వు కరిగిపోతుంది. జాగ్రత్తలు! బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. మోడల్ : ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్ ఫొటోలు: శివ మల్లాల బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు సప్తరుషి యోగవిద్యాకేంద్రం హైదరాబాద్