డెంగ్యూ, చికున్ గున్యాకు చెక్
సత్వర వైద్యానికి చర్యలు
► రాష్ట్రంలో కొత్తగా 20 పరీక్ష కేంద్రాలు
► ఈ ఏడాది ఏడు ప్రారంభం వచ్చే ఏడాది మరో 13 ఏర్పాటు
► ఆరోగ్యశాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శరీరంలోని అన్ని వ్యవస్థల ను దెబ్బతీస్తూ... జీవితకాలం ఆరోగ్య సమస్య లను తెస్తున్న డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులను వెంటనే గుర్తించి వేగంగా చికిత్స అందించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆరోగ్య శాఖ భావిస్తోంది. నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14 చోట్ల డెంగ్యూ, చికున్ గున్యా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
వీటికి అదనంగా మరో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భద్రాచలం, కొత్తగూడెం కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమ య్యాయి. సిద్దిపేట, తాండూరు, కామారెడ్డి, నిర్మల్, బాన్సువాడలో త్వరలో కొత్త కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాక వచ్చే ఏడాది మరో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు రూపొందించింది.
ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఉండడంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్నవి, కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 34 పరీక్ష కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీం తో వేగంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స జరగ నుంది. దోమల నిర్మూలన, పరిసరాల పరిశుభ్ర తపై అందరికీ అవగాహన కల్పిస్తూ నే... చికున్ గున్యా, డెంగ్యూ చికిత్సను వేగంగా అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ అదన పు సంచాలకురాలు ఎస్.ప్రభావతి తెలిపారు.
చికున్ గున్యా, డెంగ్యూ పరీక్ష కేంద్రాలు
ప్రస్తుతం పని చేస్తున్నవి: వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని ఐపీఎం, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, రొనాల్డ్ రాస్ ఆస్పత్రులు.
ప్రతిపాదిత కేంద్రాలు
యాదాద్రి, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, మెదక్, జనగామ, మహబూబాబాద్, అర్మూర్, బోధన్.
డెంగ్యూ కేసులు...
జిల్లా పేరు 2016 2017
ఖమ్మం 1416 205
హైదరాబాద్ 780 71
రంగారెడ్డి 568 31
నిజామాబాద్ 258 18
కరీంనగర్ 210 15
వరంగల్ 207 08
మహబూబ్‌నగర్ 122 12
మెదక్ 93 11
నల్లగొండ 66 01
ఆదిలాబాద్ 39 04
వివరాలు.. 2017 ఆగస్టు 16 వరకు.
చికున్ గున్యా కేసులు జిల్లాల వారీగా
జిల్లా పేరు 2016 2017
హైదరాబాద్ 22 5
మహబూబ్‌నగర్ 23 3
ఖమ్మం 15 0
రంగారెడ్డి 7 2
నిజామాబాద్ 1 1
ఆదిలాబాద్ 0 1
వరంగల్ 0 1.