తక్కువ ఖర్చుతో నోటి క్యాన్సర్ నిర్ధారణ
తక్కువ ఖర్చుతో నోటి క్యాన్సర్ నిర్ధారణ
Published Sat, Sep 24 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
– అందుబాటులోకి వచ్చిన ఓసీటీ పరికరం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అతి తక్కువ ఖర్చుతో లేజర్ టెక్నాలజీని వినియోగించుకొని నోటి క్యాన్సర్‌ను నిర్ధారణ చేసే ‘ఆప్టికల్ కొహెరెంట్ టోమోగ్రఫీ(ఓసీటీ)’ పరికరాన్ని కనిపెట్టినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెట్రా విల్డర్ స్మిత్ పేర్కొన్నారు. గతంలో వ్యాధి నిర్ధారణకు 80 వేల డాలర్ల ఖర్చు అయ్యేదని, ఓసీటీ యంత్రంతో కేవలం 5 వేల డాలర్లకు నిర్ధారణ చేయవచ్చన్నారు. జి.పుల్లారెడ్డి దంత కళాశాలలో శుక్రవారం నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఓసీటీ యంత్రంపై దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా కాంగిజేంట్–2016 పేరిట సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు
ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఓటీసీ పరికరం వినియోగంపై అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పెట్రా విల్డర్ స్మిత్ ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ వికాష్ అగర్వాల్ మాట్లాడుతూ..టీ స్కాన్ పరికరంతో దవడ కండరాల వ్యాధులను సులభంగా గుర్తించవచ్చని వివరించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ దివాకర్ సైకో సోమాటిక్ డీసీజ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వికాష్ అగర్వాల్, దివాకర్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగాధిపతి సాయిరాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీధర్‌రెడ్డి, ప్రొఫెసర్లు ప్రవీణ్, వికాష్, నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement