Oral cancer
-
రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా? అయితే మీకో హెచ్చరిక!
నోటి దుర్వాసనను నివారించేందుకు, ఫ్రెష్‌గా ఉండేందుకు లిస్టరిన్ మింట్ మౌత్ వాష్‌ను తరచుగా వినియోగిస్తున్నారా? అయితే తాజా అధ్యయనం గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ప్రముఖ కంపెనీకి చెందిన లిక్విడ్ మౌత్ వాష్ వాడితే కేన్సర్ ప్రమాదం మరింత పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీలో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది. బెల్జియంలోని యాంట్వెర్ప్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ నిపుణులు ఇటీవలి అధ్యయనంలో కూల్ మింట్ ఫ్లేవర్ మౌత్‌వాష్ రోజువారీ వినియోగంపై పరిశోధన చేశారు. దీని ప్రకారం రోజూ లిస్టరిన్ కూల్ మింట్ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు అంటు వ్యాధులు, ఇతర వ్యాధులతో ముడిపడి ఉన్న బ్యాక్టీరియా జాతులైన ‘ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, స్ట్రెప్టోకోకస్ ఆంజినోసస్’ స్థాయిలను బాగా ఎక్కువగా గుర్తించినట్టు తెలిపారు. ఇవి రక్తంలో కలిసి పలు నోటి సమస్యలకు కారణమవుతాయని అధ్యయన రచయిత ప్రొఫెసర్ క్రిస్ కెన్యన్ తెలిపారు. నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్లు కూడా లిస్టెరిన్ కెమికల్ కారణంగా వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందన్నారు. మౌత్ ఫ్రెష్నర్లోని రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా బాగా పెరిగిపోతుందని, ఫలితంగా పీరియాంటల్ వ్యాధులు, అన్నవాహిక, కొలొరెక్టల్ కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయన్న గత పరిశోధనలు కూడా గుర్తించాయని ఆయన ఉటంకించారు. ‘‘చాలా మంది వ్యక్తులు దీనిని ఉపయోగించకూడదు. ఒకవేళ దానిని ఉపయోగిస్తే, వారు ఆల్కహాల్ లేనిది ఎంచుకోవాలి. అలాగే వినియోగాన్ని రెండు రోజులకు పరిమితం చేయాలి." అని పేర్కొన్నారు. తమ అధ్యయనం లిస్టరిన్ను మాత్రమే పరీక్షించినప్పటికీ, ఇతర ఆల్కహాల్ ఆధారిత మౌత్‌వాష్‌లతో కూడా ముప్పు ఉంటుందని ప్రొఫెసర్ నొక్కి చెప్పారు.అలాగే నోటిలోని సమస్యలు, అనారోగ్యం వివిధ రకాల కేన్సర్ల ముప్పును పెంచుతుంది. నోటిలోని దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు కేన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలు, సెల్యులార్ మార్పులు, డీఎన్ఏ ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు. చివరికి ప్రాణాంతం కూడా కావచ్చు. ప్రతి ఒక్కరికి నోటి, గొంతు ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. రెగ్యులర్ బ్రషింగ్, ఫ్లాసింగ్ , డెంటల్ చెక్-అప్ల ద్వారా మంచి నోటి పరిశుభ్రతను కాపాడుకోవాలి. సుదీర్ఘ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా నివారణలో శ్రద్ధ వహించాలి. తద్వారా కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి పరిశుభ్రతను పాటించకపోవడంతోపాటు, పొగాకు వాడకం, అధిక మద్యపానం నోటి, గొంతు, అన్నవాహిక తదితర కేన్సర్లకు కారకాలు అనేది గుర్తించాలి. నోటి ఆరోగ్య సమస్యలకు వైద్యుల ద్వారా తగిన చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు.అయితే కెన్వ్యూ వాదనలను లిస్టరిన్ యజమాన్యం తిరస్కరించింది.మౌత్ వాష్‌లో ఏముంటుంది?సాధారణంగా మౌత్‌వాష్‌లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇలాంటి వాటిని నిత్యం వాడటం వల్ల నోటి లోపలి చర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు వస్తాయి. ఇది నోటి కేన్సర్ ముప్పును కూడా పెంచుతుంది. -
జస్ట్ లాలాజలంతోనే గొంతు, నోటి క్యాన్సర్లను గుర్తించే పరికరం!
క్యాన్సర్లలో కొన్నింటిని చాలావరకు ముందుగానే తెలుసుకుని, కొద్దిపాటి శస్త్ర చికిత్సలతో బయటపడొచ్చు. కానీ గొంతు, నోటి క్యాన్సర్ల విషయంలో అలా కాదు. చాలా వరకు చివరి స్టేజ్‌లోనే గుర్తించగలం. ముందుగా గుర్తించడం అసాధ్యం. అలాంటి ప్రాణాంతక క్యాన్సర్లని ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకునేలా ఏఐ ఆధారిత సరికొత్త సాధనాన్ని ఆవిష్కరించారు పరిశోధకులు. ఏ వ్యాధి అయినా నయం చేయడం కంటే రాకుండా నివారించడం అనేది ఉత్తమం. కాబట్టి ఆ రకమైన క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందా? అన్నది ఈ అత్యాధునిక సాధనంతో ముందుగా గుర్తిస్తే..వెంటనే ఆ వ్యాదులకు బ్రేక్ వేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టగలుగుతాం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటా సరికొత్త సాధనం? ఎలా క్యాన్సర్‌ని డిటెక్ట్ చేస్తుంది? కచ్చితమైన ఫలితాలే ఇస్తుందా..? తదితరాల గురించే ఈ కథనం. నోరు, గొంతు క్యాన్సర్లను ముందుగా గుర్తించే అత్యాధుని పరకరాలు లేకపోవడంతో ఆ క్యాన్సర్లను లాస్ట్ స్టేజ్‌లోనే గుర్తించడం జరగుతోంది. ఈ సమస్యకు చెక్‌పెట్టే సోలెడాడ్ సోసా, జూలియా, అగ్యిర్రే ఘిసో తదితర పరిశోధక బృందం కంప్యూటర్ ఆధారిత పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది 90% కచ్చిత ఫలితాలను ఇవ్వగలదని వెల్లడించారు. ఈ బృందం గొంతు, నోటి క్యాన్సర్లను ఫస్ట్ స్టేజ్‌లోనే ఎలా నివారించాలనే దిశగా గతంలో పలు పరిశోధనలు చేసింది. ఆ అధ్యయనంలో నిద్రాణంగా ఉన్న క్యాన్సర్ కణాల సామర్థ్యాన్ని ఎన్ఆర్2ఎఫ్1(NR2F1) ప్రోటీన్‌తో నియంత్రించొచ్చని కనుగొన్నారు. ప్రోటీన్ ఎలా నియంత్రిస్తుందంటే.. ఈ గ్రాహక ప్రోటీన్ సెల్ న్యూక్లియస్‌లోకి ప్రవేశించి, క్యాన్సర్ కణాల విస్తరణను నిరోధించే ప్రోగ్రామ్‌ను సక్రియం చేసేందుకు అనేక జన్యువులను ఆన్ లేదా ఆఫ్ చేస్తుంది. ప్రాథమిక కణుతుల్లో ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిలు తక్కువుగా ఉంటాయి. దీంతో నిద్రాణంగానే క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందడం మొదలు పెడతాయి. దీంతో ఎన్ఆర్2ఎఫ్1 ప్రోటీన్ స్థాయిలు తగ్గడం జరుగుతుంది. అందువల్ల ఈ ఎన్ఆర్2ఎఫ్1 ప్రోటీన్ సాయంతో నిద్రాణంగా ఉన్న ఈ క్యాన్సర్ కణాలను ప్రేరేపించేలా సంక్రియం చేస్తే సులభంగా క్యాన్సర్ కణాలను నియంత్రించొచ్చని వెల్లడించారు పరిశోధకులు. అంటే ముందుగానే ఆ ప్రోటీన్ స్థాయిలను గుర్తించే అత్యాధునిక పరికం ఉంటేనే ఇదంతా సాధ్యం అని భావించారు పరిశోధకులు. ఆ ఆలోచనే ఈ కంప్యూటర్ ఆధారిత స్కీనింగ్ సాధన ఆవిష్కరణకు నాంది పలికింది. ఇది ముందుగానే రోగి శరీరంలోని ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిని గుర్తించి సక్రియం చేసేలా సీ26 డ్రగ్‌తో చికిత్స అందిస్తారు వైద్యులు. దీంతో రోగిలో క్యాన్సర్ కణాల విస్తరణ తగ్గి ఎన్ఆర్2ఎఫ్1 స్థాయిలు పెరుగుతాయి. వ్యొమ్ లైఫ్ సైన్స్ సారథ్యంలో ఆవిష్కరించిన ఈ అత్యాధునిక క్యాన్సర్ డిటెక్టర్ జస్ట్ రోగుల లాలాజలాంతోనే నోరు, గొంతులోని క్యాన్సర్ కణాలను ముందుగానే డిటెక్ట్ చేసేస్తుంది. నోటి లేదా గొంతు క్యాన్సర్ ఉన్న వ్యక్తులు, లేని వ్యక్తుల లాలాజాలం చాలా విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. తాము ఈ ఏఐ ఆధారిత క్యాన్సర్ డిటెక్టర్‌తో దాదాపు 945 మంది నుంచి లాలాజల నమునాలను స్వీకరించామని, వాటిలో 80 నోటి క్యాన్సర్లు కాగా, 12 మాత్రం గొంతు క్యాన్సర్ నమునాలని వెల్లడించారు. ఆయా లాలాజల్లోని శిలింధ్రం, బ్యాక్టిరియా, జన్యువులను గుర్తించేలా సాధానానికి ట్రైయినింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. అధ్యయనంలో ఈ సాధనం 90% చక్కటి ఫలితాలనిచ్చిందన్నారు. తాము దీర్ఘకాలికి వ్యాధుల మూలలను గుర్తించి ముందుగానే నివారించేలా చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ అత్యాధునిక క్యాన్సర్ డిటెక్టర్‌ని కనిపెట్టామని అన్నారు. ఇదేవిధంగా ఇతర ప్రాణాంతక వ్యాధులను కూడా ముందుగానే గుర్తించేలా సాధనాలను అభివృద్ధిపరచడమే గాక ఆ సమస్యను నుంచి బయటపడేలా కొంగొత్త వైద్య విధానాలను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు. (చదవండి: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు) -
ఈ లక్షణాలు ఉన్నాయా?.. ఇలా చేసి నోటి క్యాన్సర్ నుంచి కాపాడుకోండి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రజల ఆరోగ్యంపై జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అధునాతన పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటోంది. పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉచితంగా ఖరీదైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. తాజాగా నోటి క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి.. వ్యాధికి చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. వైద్యులకు శిక్షణ ఇచ్చిన అనంతరం వెల్‌స్కోప్ మెషీన్లు ఏర్పాటు చేసి క్యాన్సర్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పొగాకు, పొగాకు మసాలాలతో పాటు బీడీలు, సిగరెట్ తాగుతున్న వారిలో నోటి క్యాన్సర్ తీవ్రమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకుంటున్న క్యాన్సర్ బాధితుల్లో ఆరు శాతం మంది నోటి క్యాన్సర్ (ఓరల్ క్యాన్సర్) వారే ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోజురోజుకూ దీని తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందే ఓరల్ క్యాన్సర్‌ను పసిగట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీతో నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. ప్రాథమిక క్యాన్సర్ దశకు రాకముందే.. లేదంటే అలాంటి లక్షణాలు కనిపించకముందే క్యాన్సర్ స్థితిని ఓ పరికరం ద్వారా అంచనా వేస్తారు. ఇలాంటి పరికరాలను ఏపీ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. చదవండి: సోలో బ్రతుకే సో 'బెటరు' వెల్‌స్కోప్ మెషీన్ ద్వారా పరీక్షలు.. వెల్‌స్కోప్ మెషీన్ అంటేనే ఇదొక అత్యాధునిక వైద్యపరికరం. తరంగ దైర్ఘ్యాల నీలి కాంతిని ప్రేరేపణ చేసి నోటిలో ఉన్న పరిస్థితులను అంచనా వేస్తుంది. క్యాన్సర్ వచ్చే లక్షణాలను ముందే పసిగట్టగలిగే సామర్థ్యం ఉంటుంది. ప్రీ క్యాన్సర్ లక్షణాలే క్యాన్సర్‌కు దారి తీస్తాయి. వాటిని ముందే గ్రహించి చెప్పగలదు. ఇలాంటి వెల్‌స్కోప్ మెషీన్లను వైజాగ్, విజయవాడ, కడపలో ఏర్పాటు చేశారు. కడపలో ఏర్పాటు చేసిన ఈ మెషీన్ పరిధిలో 9 జిల్లాల వైద్యులకు శిక్షణ ఇస్తారు. ఇందులో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో... పీహెచ్సీ వైద్యులకు, దంతవైద్యులకు వెల్‌స్కోప్ మెషీన్ ద్వారా శిక్షణ నిచ్చిన అనంతరం అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ వెల్‌స్కోప్ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. మెషీన్ల ఏర్పాటు అనంతరం భారీ స్థాయిలో నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇలా ముందే లక్షణాలను గుర్తించి చికిత్స చేస్తే వేలాదిమంది ప్రాణాలను కాపాడవచ్చనేది వైద్యుల అభిప్రాయం. ఓ వైపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే అదే ప్రాంతంలో మరోవైపు పొగాకు ఉత్పత్తుల వాడకం నియంత్రణపై కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వైద్యులకు ఈ మెషీన్ ద్వారా నిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తున్నారు. క్యాన్సర్ బారినుంచి కాపాడవచ్చు నోటి క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉంది. ముందస్తు లక్షణాలు గుర్తించి చికిత్స అందిస్తే వ్యయభారం తగ్గుతుంది. భవిష్యత్‌లో ఇది అన్ని చోట్లా విస్తరిస్తే మరింతగా లబ్ధి కలుగుతుంది. ముఖ్యంగా పొగాకు వాడకంతో క్యాన్సర్‌కు గురయ్యేవారిని క్యాన్సర్ బారినుంచి కాపాడచ్చు. – డాక్టర్ శ్రీనివాసన్, క్యాన్సర్‌కేర్ నోడల్ ఆఫీసర్ -
ఆత్మవిశ్వాసంతో చిరునవ్వులు చిందిస్తున్నారా? నోటి దుర్వాసనకు చెక్‌పెట్టండిలా!
Does your smile exude confidence? Know Your Oral Health In Detail: రోజువారీ కార్యకలాపాలలో సామాజిక బాంధవ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. మెరిసే చిరునవ్వు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో కీలకంగా వ్యవహరిస్తుందనడంలో సందేహంలేదు! అందుకు శుభ్రమైన దంతాలు, తాజా శ్వాస చాలా ముఖ్యం. చిరునవ్వు అందంగా ఉండాలంటే శ్వాస తాజాగా ఉండాల్సిందే! ఐతే ప్రతి ఒక్కరికీ ఇది సాధ్యం కాదు. 90శాతం మందికి నోటి దుర్వాసన సమస్య ఉంటుందనేది నిపుణుల మాట. నోటి దుర్వాసన, దంతాల కావిటీస్, చిగుళ్ల సమస్యలు, అల్సర్లు, దంతాల కోత, దంతాల సున్నితత్వం, విరిగిన దంతాలు, ఆకర్షణగాలేని చిరునవ్వు, నోటి క్యాన్సర్.. ఈ 9 కారణాలు కారణం కావొచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది నోటి దుర్వాసన (బ్యాడ్ బ్రీత్)! దాదాపు ప్రతి ఒక్కరిలో నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. దీనిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు గుర్తించినా చెప్పడానికి ఇబ్బందిపడతారు. శరీర దుర్వాసన వలె, నోటి దుర్వాసన కూడా ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలను చెడగొట్టవచ్చు! నోటి దుర్వాసనకు స్థూలంగా 2 కారణాలు ►నోటి లేదా దంత కారణాలు ►నాన్ డెంటల్ కారణాలు చదవండి: Diamond Gold Rainstorm: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా? నోటి దుర్వాసన సమస్య ఎందుకు తలెత్తుతుంది? ►దంతాలు, చిగుళ్ళు, నాలుక మధ్య ఖాళీల్లో మిగిలిన ఆహార వ్యర్థాలపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది డెంటల్ ప్లాక్కు దారి తీస్తుంది. ►కావిటీస్, డెంటల్ ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వాపు వల్ల దుర్వాసన వస్తుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసనలు ఉన్న కొన్ని ఆహారాలు లేదా జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకునే ఆహారాలు తినడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు. ►మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాలు, రక్త రుగ్మతలు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా హాలిటోసిస్‌కు దారితీయవచ్చు. ►కోవిడ్ మహమ్మారి కారణంగా దీర్ఘకాలంపాటు మాస్కులు ధరించడం వల్లకూడా నోటి దుర్వాసన సంభవిస్తుంది. ఇది మాస్క్‌లను ధరించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ (సాధారణం కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ నోటిలో ఉండిపోయి గాలిని రీసైక్లింగ్ చేయడం వల్ల జరుగుతుంది). నోటి దుర్వాసనను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి.. ►రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) బ్రష్ చేయడం, ఆహారం తిన్న తర్వాత నోరు పుక్కిలించడం ద్వారా తాజా శ్వాస పొందవచ్చు. ►టంగ్ క్లీనర్‌తో ప్రతిరోజూ మీ నాలుకను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. ►హైడ్రేటెడ్‌గా ఉండండి. రోజంతా కొద్ది కొద్దిగా నీటిని తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. ►దంత వైద్యుడిని సంప్రదించి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు చికిత్స తీసుకోవాలి. ►మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్ ఉండని, డీహైడ్రేటింగ్ చేయని మౌత్‌వాష్‌ను వాడాలి. ►షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌లను నమలాలి. ఇవి నోటిలో చిక్కుకున్న ఆహార వ్యర్థాలను తొలగించి, లాలాజలం ఊరేలా చేస్తాయి. ►ప్రతిరోజూ శుభ్రపరచిన మాస్క్‌లను లేదా కొత్తవి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. ►జీర్ణవ్యవస్థను ప్రోత్సహించే ఫైబర్ అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినాలి. ►చిగుళ్లలో రక్తస్రావం, కావిటీస్, నొప్పితోపాటు దుర్వాసన తలెత్తితే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. - డాక్టర్ దీప్తి రావ్ మెల్కోటి ఎమ్‌డీఎస్ (ఎండోడంటిక్స్) రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్ చదవండి: McDonald’s Christmas Challenge: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా? -
శభాష్ షంషేర్.. నీ సేవలు అద్భుతం..
శోకం నుంచి శ్లోకం పుట్టిందట. షంషేర్ ఆవేదన, ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్ క్విట్‌పఫ్. పదమూడు సంవత్సరాల వయసు నుంచే అద్భుతాలు చేస్తున్న నిఖియ షంషేర్ పరిచయం... స్కూల్ప్రాజెక్ట్లో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్లింది పద్నాలుగు సంవత్సరాల నిఖియ షంషేర్. అక్కడ ఒక వార్డ్‌లో నోటిక్యాన్సర్ పేషెంట్‌ను చూసింది. అతడి దవడ సగం తీసేశారు. మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను బతకడం కష్టమట...ఈ దృశ్యం షంషేర్‌ను కదిలించింది, చాలాకాలం వెంటాడింది. నోటి క్యాన్సర్ గురించి అధ్యయనం మొదలుపెట్టింది. కొత్త కొత్త విషయాలు తెలిశాయి. పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంది. మన దేశంలో నోటి క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, వక్క నమలడం....మొదలైనవి ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి వారిని సమస్యల వలయంలో నెడుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం కోసం రొటిన్ చెకప్‌లకు వెళ్లే అలవాటు మనలో చాలామందికి లేదు. ప్రారంభదశలో గుర్తించగలిగితే వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు అంటున్నాయి పరిశోధనలు. ప్రమాదఘంటికలు మోగుతున్న దశలోనే జాగ్రత్తపడే సాధనాన్ని కనిపెడితే? అలా షంషేర్ పరిశోధనల్లో నుంచి పుట్టుకు వచ్చిన సాధనమే ‘క్విట్‌పఫ్’ అనే ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్. రిస్క్‌లో ఉన్నామా? ఉంటే ఈ ఏ దశలో ఉన్నాం? అనేది ఈ ‘క్విట్‌పఫ్’ కనిపెడుతుంది. దీనివల్ల మిడిల్ నుంచి హైరిస్క్ ఉన్నవాళ్లు వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి వీలవుతుంది. ‘క్విట్‌పఫ్ లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించడం మాత్రమే కాదు అలవాట్లలో మార్పు తీసుకురావడం కూడా’ అని చెబుతోంది బెంగళూరులోని ‘గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్’ విద్యార్థి అయిన షంషేర్. అయితే ఈ ‘క్విట్‌పఫ్’ ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. ఎన్నోసార్లు ప్రయోగం విఫలం అయింది. ఒక దశలో నిరాశ కమ్మేసేది. మళ్లీ ఉత్సాహం కొని తెచ్చుకొని ప్రయోగాల్లో మునిగిపోయేది షంషేర్. మొత్తానికైతే సాధించింది! ప్రయోగదశలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. షంషేర్ మాటలు విని తేలిగ్గా తీసుకునేవాళ్లే. అనుమతి ఇచ్చే వాళ్లు కాదు. ఆమె చిన్నవయసులో ఉండడం దీనికి కారణం. ఎట్టకేలకు బెంగళూరులోని ‘విక్టోరియా హాస్పిటల్’లో అనుమతి దొరికింది. 500 మందికి పైగా క్రానిక్ స్మోకర్లు, నాన్స్మోకర్లపై పరీక్షలు నిర్వహించింది. ‘క్విట్‌పఫ్’ అనుకున్న ఫలితాలను ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది. ఈలోపు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. ఒక వైపు చదువు, మరోవైపు ‘క్విట్‌పఫ్’ ప్రాజెక్ట్‌పై పనిచేయడానికి షంషేర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. రిసెర్చ్గ్రాంట్, తనకు వచ్చిన అవార్డ్ సొమ్మును ప్రాజెక్ట్ కోసం ఉపయోగించింది. ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఒకే పాఠ్యపుస్తకాన్ని షేర్ చేసుకోవడం, చెప్పులు లేకుండా స్కూలుకు వచ్చే విద్యార్థులు, స్కూలు బ్యాగు కొనలేని పేద విద్యార్థులను చూసింది షంషేర్. ప్రయోగసహితంగా పాఠ్యబోధన జరిగితే వచ్చే ఫలితం బాగుంటుందనేది నమ్మకం కాదు శాస్త్రీయ నిజం. దురదృష్టవశాత్తు చాలా స్కూళ్లల్లో ‘పాఠ్యబోధన’ అనేది ఏకధాటి ఉపన్యాసం అవుతుంది. క్లాసుల్లో ఒక్క ప్రయోగం కూడా జరగలేదు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్ష తప్పారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. చివరికి చదువుకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దీని నుంచి మార్పు తీసుకురావడానికి పదమూడు సంవత్సరాల వయసులోనే ఫిలోంత్రపిక్ ప్రాజెక్ట్ ‘యెర్న్ టు లెర్న్’ చేపట్టింది. తల్లిదండ్రులు, స్నేహితులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో స్కూళ్లలో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కృషి చేసింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థుల చదువు మెరుగుపడింది. తన ఇ–కామర్స్ వైబ్‌సైట్ ‘క్నిక్నాక్స్’ ద్వారా వచ్చిన ఆదాయంలో వందశాతం సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. టీనేజర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే గ్లోబల్ సైన్స్ కాంపిటీషన్ ‘జూనియర్ ఛాలేంజ్’లో టాప్‌స్కోరర్‌గా నిలిచింది. తన ఫేస్బుక్ పేజీలో ‘స్పేస్‌టైమ్ అండ్ గ్రావిటీ’పై చేసిన వీడియో పోస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ‘డయానా లెగసీ అవార్డ్’ ‘ఔట్‌స్టాండింగ్ యూత్ ఎకనామిక్ సిటిజన్‌షిప్’ (జర్మనీ) అవార్డ్...మొదలైన ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్న షంషేర్‌కు అభినందనలు తెలియజేద్దాం. -
నోటి క్యాన్సర్ అంటున్నారు.. ఏం చేయాలి!
నా వయసు 49 ఏళ్లు. నేను ఇరవై ఏళ్లుగా గుట్కా తింటున్నాను. ఒక నాలుగు నెలల నుంచి నా నోటిలో వాపు కనిపించడంతో పాటు నొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలల నుంచి ఈ బాధ మరీ ఎక్కువయ్యింది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) కూడా వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ కావచ్చని, దగ్గర్లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లమని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎన్. రామస్వామి, సూళ్లూరుపేట గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. ముందుగా క్యాన్సర్ స్పెషలిస్ట్ మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చిందో తొలుత పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్‌కు సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి. ►మొదట మీకు సమస్య ఉన్న భాగంతో పాటు, మెడ భాగంలోనూ సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ► ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కూడా కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగించిన భాగాన్ని ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ► సర్జరీ తర్వాత నోరు మునపటిలా తెరచుకోదేమోనని కొందరు ఆందోళన చెంతుటుంటారు. కానీ రోబోటిక్ సర్జరీతో కుట్లూ ఉండవు. నోరు కూడా పూర్తిగా మునపటిలాగే తెచుకుంటుంది. ముందులాగే నోటిద్వారా ఆహారం తీసుకోవచ్చు. ► ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు పూర్తిగా మానిపోయాక, రేడియోథెరపీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మొదట మీరు గుట్కా/పొగాకు నమలడం పూర్తిగా మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్ వచ్చేలా చేయగలదు. మీరు వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని క్యాన్సర్ నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ సచిన్ మార్దా, సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
తక్కువ ఖర్చుతో నోటి క్యాన్సర్ నిర్ధారణ
– అందుబాటులోకి వచ్చిన ఓసీటీ పరికరం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): అతి తక్కువ ఖర్చుతో లేజర్ టెక్నాలజీని వినియోగించుకొని నోటి క్యాన్సర్‌ను నిర్ధారణ చేసే ‘ఆప్టికల్ కొహెరెంట్ టోమోగ్రఫీ(ఓసీటీ)’ పరికరాన్ని కనిపెట్టినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెట్రా విల్డర్ స్మిత్ పేర్కొన్నారు. గతంలో వ్యాధి నిర్ధారణకు 80 వేల డాలర్ల ఖర్చు అయ్యేదని, ఓసీటీ యంత్రంతో కేవలం 5 వేల డాలర్లకు నిర్ధారణ చేయవచ్చన్నారు. జి.పుల్లారెడ్డి దంత కళాశాలలో శుక్రవారం నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఓసీటీ యంత్రంపై దంత వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా కాంగిజేంట్–2016 పేరిట సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఓటీసీ పరికరం వినియోగంపై అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి పెట్రా విల్డర్ స్మిత్ ఆన్లైన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ వికాష్ అగర్వాల్ మాట్లాడుతూ..టీ స్కాన్ పరికరంతో దవడ కండరాల వ్యాధులను సులభంగా గుర్తించవచ్చని వివరించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ దివాకర్ సైకో సోమాటిక్ డీసీజ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వికాష్ అగర్వాల్, దివాకర్‌లను డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగాధిపతి సాయిరాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీధర్‌రెడ్డి, ప్రొఫెసర్లు ప్రవీణ్, వికాష్, నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలిసిన మనిషి
సునీత తోమర్ ॥పేరు సునీత. వయసు 27. భర్త, ఇద్దరు పిల్లలు. పొగాకు నమిలే అలవాటు వల్ల రెండేళ్ల వ్యవధిలోనే ఆమెకు నోటి క్యాన్సర్ వచ్చింది. ఆమె ముఖం చూడలేని విధంగా మారిపోయింది. వైద్యులు ఆపరేషన్ చేసి సునీత చెంప లోపలి క్యాన్సర్ కణితిని తొలగించారు. తిరిగి మునుపటి రూపురేఖల్ని తేగలిగారు. సునీత ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. మీకూ పొగాకు నమిలే అలవాటు ఉంటే కనుక వెంటనే మానండి. క్యాన్సర్ బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ॥ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గత ఏడాది కాలంగా ప్రసారం చేస్తూ వస్తున్న ముప్పై సెకన్ల నిడివి గల ప్రజాహిత ప్రకటన ఇది. అందులోని సునీత ఇప్పుడు లేరు. బుధవారం చనిపోయారు! అంతకు రెండ్రోజుల క్రితమే ఆమె.. ప్రధాని నరేంద్ర మోదీకి ఒక ఉత్తరం రాశారు. ‘‘పొగాకు నమలడం వల్ల క్యాన్సర్ వస్తుందని భారతదేశంలో జరిగిన ఏ శాస్త్ర పరిశోధనా ఇంతవరకు నిరూపించలేదు’’ అని గౌరవనీయులైన బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ అనడంపై సునీత ఆ ఉత్తరంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ముఖం కంటే వేరే పరిశోధనా ఫలితం కావాలా?’’ అని కూడా అడిగారు. పొగాకు ఉత్పత్తులపై విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి దిలీప్ గాంధీ అధ్యక్షుడు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడడం సునీతకు బాధ కలిగించింది. అందుకే ఆ ఉత్తరం. సిగరెట్ ప్యాకెట్లపై ప్రభుత్వ ఆదేశానుసారం ఉత్పత్తిదారులు ప్రస్తుతం ముద్రిస్తున్న హెచ్చరిక చిత్రాల సైజును ఈ ఏప్రిల్ ఒకటి నుంచి కనీసం ఎనభై ఐదు శాతం వరకైనా పెంచాల్సి ఉండగా, అలాంటి అవసరమేమీ లేదని దిలీప్ గాంధీ తేల్చేశారు. ఆ సందర్భంలోనే పొగాకు వాడకానికి, క్యాన్సర్ రావడానికి సంబంధం లేనే లేదని కూడా ఆయన అన్నారు! సునీత సొంత ఊరు మధ్యప్రదేశ్‌లోని భింద్. ఆమె భర్త ట్రక్కు డైవర్. క్యాన్సర్ తిరగబెట్టడంతో రెండు వారాల క్రితం ఆమెను మళ్లీ ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి కొంత మెరుగైంది. పిల్లల్ని (ధ్రువ్, కులదీప్) స్కూలుకు పంపడానికి ఇంట్లో ఎవరూ లేరని అడిగిమరీ సునీత డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత కొన్ని గంటలకే ఆమె చనిపోయారు. నోటి క్యాన్సర్‌తో సునీత మరణించడం, పొగాకు ఉత్పత్తులపై క్యాన్సర్ బొమ్మలు కనిపించడం... పొగాకు అలవాటు ఉన్నవారిని ఎంతవరకు మారుస్తాయో చెప్పలేం. కానీ సమాజానికి మార్గదర్శకులుగా ఉండవలసిన నాయకుల ప్రతి చిన్నమాటా సమాజంపై క్యాన్సర్‌కు ఏ విధంగానూ తక్కువ కానంతగా ప్రభావం చూపుతుందని ఆ పెద్ద మనుషులకు ఎవరు చెప్పాలి? గిరిరాజ్‌సింగ్ కేంద్ర మంత్రి. అంతటి మనిషి ఏమన్నారో విన్నారు కదా! రాజీవ్‌గాంధీ కనుక నైజీరియా మహిళను చేసుకుని వస్తే, ఆమె తెల్లగా లేకపోతే.. కాంగ్రెస్ వాళ్లు ఆమె నాయకత్వాన్ని అంగీకరించేవారా? అని. ఇంకొకాయన గోవా సీయెం లక్ష్మీకాంత్ పర్సేకర్. నర్సులు నిరాహార దీక్షలు చేస్తుంటే, వాళ్ల సమస్యల్ని పట్టించుకోకుండా... ‘‘ఎండలో కూర్చుంటే నల్లబడిపోతారు, తర్వాత పెళ్లి కావడం కష్టం’’ అని పాపం ఆయన ఎంతగానో బాధపడిపోయారు. జేడీ(యు) ఎంపీ శరద్ యాదవ్ అబ్జర్వేషన్ మరోలా ఉంది. ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీ తీసిన దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ తెల్లగా ఉండబట్టే ఆమెకు ఇంటర్వ్యూ తేలిగ్గా దొరికిందట. అంతే కాదట. తెల్లగా ఉన్న ఆడవాళ్లకు అవకాశాలు వరదలా వచ్చేస్తాయట! ఈ ముగ్గురు ‘తెల్లదనం ప్రియులు’ చేసిన కామెంట్లు, అత్యాచారాలకు ఆడవాళ్లనే బాధ్యులను చేస్తూ తరచు మనకు వినిపించే మహానుభావుల వ్యాఖ్యానాలు కూడా క్యాన్సర్ లాంటివే. కాకపోతే అవి నోటి క్యాన్సర్లు కావు. మాట క్యాన్సర్లు. నోటి క్యాన్సర్ ఒక్కరి వరకే ఉంటుంది. మాట కేన్సర్ సమాజం మొత్తానికీ ప్రబలుతుంది. ‘‘నాలాగా అవుతారు జాగ్రత్త’’ అని సునీత భయం చెప్పి వెళ్లారు. ‘‘ఏమీ కాదు’’ అని దిలీప్ గాంధీ భరోసా ఇస్తున్నారు! నిజానికి ‘భయం’ మాత్రమే ఏమీ కానివ్వదు. భరోసా డేంజర్. మంచీచెడును ఆలోచించనివ్వదు. మాధవ్ శింగరాజు పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికను పెద్ద సైజులో ముద్రించాలని ఉద్యమించిన సునీతా తోమర్, అందుకు గడువు తేదీ అయిన ఏప్రిల్ 1న ప్రభుత్వం ఆ డిమాండును తిరస్కరించిన రోజే మరణించడం యాదృచ్ఛ్చికమే అయినప్పటికీ అత్యంత బాధాకరం. -
నొప్పి లేని దంత వైద్యం లేజర్ ద్వారా సాధ్యం
దంత అనారోగ్యమే కాదు... వాటి చికిత్స కూడా బాధాకరం అనే అభిప్రాయం మనలోని చాలామందిలో ఉంటుంది. దంతాలకు సంబంధించిన దాదాపు అన్ని సమస్యలకూ, లేజర్ చక్కటి పరిష్కారం. నొప్పిలేకుండా చాలా త్వరగా ఉపశమనం కలిగించే ఆధునాతన చికిత్స లేజర్. లేజర్: లేజర్ అనే కాంతి తక్కువ సమయంలో శరీరంలోని ఏ భాగానికైనా ఎటువంచి నొప్పిని కలిగించకుండా, ఇన్ఫెక్షన్ను తగ్గించి, చాలా తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. దంత చికిత్సలో లేజర్ వల్ల ఉపయోగాలు: నొప్పి కలగకుండా చికిత్స ఎటువంటి మత్తు అవసరం ఉండదు చికిత్స సమయంలో ఎటువంటి రక్తస్రావమూ ఉండదు. వైద్యులకు, రోగికి కూడా అనుకూలం ఇన్ఫెక్షన్ వ్యాపించదు తక్కువ సమయంలో నొప్పిని, వ్యాధిని ఉపసంహరిస్తుంది చక్కెర వ్యాధి, రక్తపోటు, గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధి గ్రస్తులకు చాలా అనుకూలం లేజర్ చికిత్స తర్వాత, ఉపయోగించే మందులు కూడా తక్కువ. దంత చికిత్సలో లేజర్ : చిగుళ్ళ చికిత్స : చిగుళ్ళ వాపులు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి వ్యాధుల్లో (జింజెవైటిస్, పెరియోడాంటైటిస్) లేజర్‌తో చికిత్స చేయడం చాలా సులువు. డయాబెటిక్ వ్యాధి గ్రస్తులలో ఇది చాలా ఉపయోగం రూట్ కెనాల్ చికిత్స: లేజర్ కాంతిని కెనాల్లో ప్రవేశపెట్టడం ద్వారా, బ్యాక్టీరియా పూర్తిగా నాశనం అయి, sterils ఎన్విరాన్మెంట్ ఏర్పడి మరలా రీఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. పిప్పిపళ్ళ చికిత్స: పంటిని డ్రిల్ చేసేటప్పుడు, పేషెంట్ అనవసరమైన ఆందోళనకు గురికాకుండా, సెన్సిటివిటీ లేకుండా ఉండేందుకు లేజర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటిలోని అల్సర్లను, గడ్డలను తగ్గించుటకు నోటి కేన్సర్‌ను గుర్తించడానికి దంతాలు తెల్లగా కనిపించడానికి ఇతర సర్జికల్ పద్ధతులలో కూడా లేజర్ ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు లేజర్ టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉంది. మీ దంత సంరక్షణ మీ చేతుల్లోనే ఉంది. దంతాల మెరుగైన చికిత్స కోసం, లేజర్ ప్రక్రియ ఒక మెరుగైన పరిష్కారం.