Does your smile exude confidence? Know Your Oral Health In Detail: రోజువారీ కార్యకలాపాలలో సామాజిక బాంధవ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. మెరిసే చిరునవ్వు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడంలో కీలకంగా వ్యవహరిస్తుందనడంలో సందేహంలేదు! అందుకు శుభ్రమైన దంతాలు, తాజా శ్వాస చాలా ముఖ్యం. చిరునవ్వు అందంగా ఉండాలంటే శ్వాస తాజాగా ఉండాల్సిందే! ఐతే ప్రతి ఒక్కరికీ ఇది సాధ్యం కాదు. 90శాతం మందికి నోటి దుర్వాసన సమస్య ఉంటుందనేది నిపుణుల మాట. నోటి దుర్వాసన, దంతాల కావిటీస్, చిగుళ్ల సమస్యలు, అల్సర్లు, దంతాల కోత, దంతాల సున్నితత్వం, విరిగిన దంతాలు, ఆకర్షణగాలేని చిరునవ్వు, నోటి క్యాన్సర్.. ఈ 9 కారణాలు కారణం కావొచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది నోటి దుర్వాసన (బ్యాడ్ బ్రీత్)!
దాదాపు ప్రతి ఒక్కరిలో నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. దీనిని కుటుంబ సభ్యులు, సన్నిహితులు గుర్తించినా చెప్పడానికి ఇబ్బందిపడతారు. శరీర దుర్వాసన వలె, నోటి దుర్వాసన కూడా ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలను చెడగొట్టవచ్చు!
నోటి దుర్వాసనకు స్థూలంగా 2 కారణాలు
►నోటి లేదా దంత కారణాలు
►నాన్ డెంటల్ కారణాలు
చదవండి: Diamond Gold Rainstorm: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా?
నోటి దుర్వాసన సమస్య ఎందుకు తలెత్తుతుంది?
►దంతాలు, చిగుళ్ళు, నాలుక మధ్య ఖాళీల్లో మిగిలిన ఆహార వ్యర్థాలపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది డెంటల్ ప్లాక్‌కు దారి తీస్తుంది.
►కావిటీస్, డెంటల్ ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల వాపు వల్ల దుర్వాసన వస్తుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసనలు ఉన్న కొన్ని ఆహారాలు లేదా జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకునే ఆహారాలు తినడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు.
►మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, కాలేయం, మూత్రపిండాలు, రక్త రుగ్మతలు వంటి శ్వాసకోశ సమస్యలు కూడా హాలిటోసిస్‌కు దారితీయవచ్చు.
►కోవిడ్ మహమ్మారి కారణంగా దీర్ఘకాలంపాటు మాస్కులు ధరించడం వల్లకూడా నోటి దుర్వాసన సంభవిస్తుంది. ఇది మాస్క్‌లను ధరించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్ (సాధారణం కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ నోటిలో ఉండిపోయి గాలిని రీసైక్లింగ్ చేయడం వల్ల జరుగుతుంది).
నోటి దుర్వాసనను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి..
►రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) బ్రష్ చేయడం, ఆహారం తిన్న తర్వాత నోరు పుక్కిలించడం ద్వారా తాజా శ్వాస పొందవచ్చు.
►టంగ్ క్లీనర్‌తో ప్రతిరోజూ మీ నాలుకను శుభ్రం చేయడం మర్చిపోవద్దు.
►హైడ్రేటెడ్‌గా ఉండండి. రోజంతా కొద్ది కొద్దిగా నీటిని తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.
►దంత వైద్యుడిని సంప్రదించి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు చికిత్స తీసుకోవాలి.
►మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్ ఉండని, డీహైడ్రేటింగ్ చేయని మౌత్‌వాష్‌ను వాడాలి.
►షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌లను నమలాలి. ఇవి నోటిలో చిక్కుకున్న ఆహార వ్యర్థాలను తొలగించి, లాలాజలం ఊరేలా చేస్తాయి.
►ప్రతిరోజూ శుభ్రపరచిన మాస్క్‌లను లేదా కొత్తవి ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.
►జీర్ణవ్యవస్థను ప్రోత్సహించే ఫైబర్ అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను తినాలి.
►చిగుళ్లలో రక్తస్రావం, కావిటీస్, నొప్పితోపాటు దుర్వాసన తలెత్తితే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.
- డాక్టర్ దీప్తి రావ్ మెల్కోటి
ఎమ్‌డీఎస్ (ఎండోడంటిక్స్)
రూట్ కెనాల్ స్పెషలిస్ట్ అండ్ కాస్మెటిక్ డెంటిస్ట్
చదవండి: McDonald’s Christmas Challenge: వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా?
Comments
Please login to add a commentAdd a comment