జ్వరం, జలుబే కదా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు!..అవే ఒక్కొసారి.. | 5 Year Old Girl Died Due To Bacterial Infection Misdiagnosed With Cold | Sakshi
Sakshi News home page

జ్వరం, జలుబే కదా అని తేలిగ్గా కొట్టిపారేయొద్దు!..అవే ఒక్కొసారి..

Published Mon, Sep 11 2023 5:04 PM | Last Updated on Tue, Sep 12 2023 9:15 AM

5 Year Old Girl Died Due To Bacterial Infection Misdiagnosed With Cold - Sakshi

మనం సాధారణంగా చిన్నిపిల్లలకు వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను చాలా తేలిగ్గా తీసుకుంటాం. ట్యాబలెట్‌లు వేస్తున్నాం కదా తగ్గిపోతుందనుకుంటాం. చాలా సర్వసాధరణమైన వ్యాధిగానే భావిస్తాం. కొన్ని రకాల వ్యాధులు విజృంభించే క్రమంలో తొలి దశలో అలాంటి తేలికపాటి లక్షణాలనే చూపిస్తాయి. మనం తెలియక సాధారణమైన జ్వరంగా భావించి ఎప్పుడూ వాడే వాటినే వాడేస్తాం. కానీ మనం కంటిపాపల్లా కాపాడుకుంటున్న చిన్నారుల ప్రాణాలు పోయేంతవరకు కళ్లు తెరవవం. అచ్చం అలాంటి దురదృష్టకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..ఆస్ట్రేలియాలోని బాథర్స్ట్‌ నివాసి క్యాథీ అనే 5 ఏళ్ల చిన్నారి గత కొద్దిరోజులుగా జలుబుతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడుతున్నారు. కానీ క్యాథీ కోలుకోవడం మాని ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడం ప్రారంభమైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. సాధారణమైన జలుబే కదా అనే భావించారు. సరిగ్గా తినక జబ్బు పడుటుందని భావించి ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు.

తీరా జాయిన్‌ అయ్యాక కోలుకుందా అంటే.. లేకపోగా మరింత సీరియస్‌ అయ్యి మూసిన కన్ను తెరవకుండా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. చిన్న జలుబు లాంటి ఫీవర్‌ ఇంతలా మా చిన్నారిని కోల్పోయేంత ప్రాణాంతక మారడం ఏమిటిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో వారు మరోసారి ఆమె హెల్త్‌ రికార్డును చెక్‌ చేయించి ఇది జలుబు మరేదైనా అని పలు ఆస్పత్రుల్లో ఎంక్వైయిరి చేయగా అసలు విషయం బయటపడింది. స్ట్రెప్‌ఏ అనే బ్యాక్టీరియా బారిన పడినట్లు గుర్తించారు వైద్యులు.

దీని కారణంగానే మూడు రోజుల తర్వాత ఆమె గొంతును పూర్తిగా కోల్పోయిందన్నారు. ఆమె పరిస్థితి మరింత దిగజారి, శ్వాసతీసుకోలేని స్థితికి వచ్చాక మళ్లీ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసినట్లు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. ఐతే వైద్య పరీక్షల్లో వైరల్‌ ఫీపర్‌ అని తేలింది దీంతో తాము తేలిగ్గా తీసుకున్నామని ఆవేదనగా చెబుతున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇంటికి వచ్చకా చిన్నారి ఆరోగ్యం క్షీణించటం, పెదాలు నీలం రంగులోకి మారిపోవడం శ్వాసతీసుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తినట్లు వివరించారు. ఎంతలా సీఆర్‌పీ చేసి బతికించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు తలిదండ్రులు.

ఇంత చిన్నపాటి అనారోగ్యం తమ కూతురు ప్రాణాలను బలితీసుకోవడం జీర్ణించుకోలేక ఆ చిన్నారి శరీరాన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తెలిసింది. ఆమె గొంతు స్టెప్‌ఏ బ్యాక్టీరియా ఇన్షెక్షన్‌కు గురైందని ఇది చాలా రకాలు లక్షణాలతో సంకేతాలిస్తుందని, వైద్యులు కూడా ఒక్కోసారి ఇలాంటి కేసులను గుర్తించడంలో విపలమతుంటారని వివరణ ఇచ్చింది వైద్య బృందం.

విచిత్రమేమిటంటే ప్రాణాలతో పోరాడి చనిపోయిన ఆ చిన్నారి ముగ్గురికి అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు కాస్త సీరియస్‌గా తీసుకుని పవర్‌ఫుల్‌ యాంటీబయోటిక్స్‌ ఇచ్చి ఉంటే మా చిన్నారి మా కళ్ల ముందు ఆడుతూ తిరిగి ఉండేదంటూ వేదనగా చెప్పారు. అందువల్ల పేరెంట్స్‌ అందరూ  చిన్నారులకు వచ్చి కొన్ని రకలా వైరల్‌ ఫీవర్లను తేలిగ్గా తీసుకోవద్దు. మీ కంటి పాపలను దూరం చేసుకుని శోకాన్ని కొనితెచ్చుకోవద్దని బాధిత తల్లిందండ్రులు ఆవేదనగా వేడుకుంటున్నారు. 

(చదవండి: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement