తెలుగుదేశం పాలనలో జరిగిన భారీ కుంభకోణానికి అనంతపురం జిల్లాలోనే బీజం పడింది. 2015–19 మధ్య కాలంలో ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను చంద్రబాబు సర్కారు ఔట్ సోర్సింగ్ కింద ‘మెడాల్’ సంస్థకు కట్టబెట్టింది. పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురంలో ‘బ్రహ్మాండం’గా రక్తపరీక్షలు నిర్వహించారంటూ నివేదిక ఇప్పించి ఆగమేఘాల మీద ఆ సంస్థకే రాష్ట్ర వ్యాప్తంగా రక్తపరీక్షల నిర్వహణను కట్టబెట్టింది. మెడాల్ సంస్థ డాక్టర్లతో కుమ్మక్కై అవసరం ఉన్నా లేకున్నా రక్త పరీక్షలు రాయించి దాదాపు రూ.300 కోట్లు లూటీ చేసింది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు వైద్య సేవల ముసుగులో భారీ దోపిడీ జరిగింది. రోగులకు ఉచితంగా చేసే రక్త పరీక్షల నిర్వహణను ఔట్‌సోర్సింగ్ ద్వారా ప్రైవేట్‌కు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగమైంది. రక్త పరీక్షల సేవల ఫ్రాంచైజీలు దక్కించుకున్న టీడీపీ నేతలు సైతం అందినంత దోచుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల నిర్వహణను టీడీపీ ప్రభుత్వం 2015లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థకు ఇవ్వాలనుకుంది. ఇందు కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద అనంతపురాన్ని ఎంపిక చేసింది. ఈ మేరకు జీఓ 17 జారీ చేసింది. తొలుత జిల్లాలో ఆరు నెలల పాటు రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైతే ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది జీఓ సారాంశం. ఆ మేరకు ఆ ఏడాది జూన్‌లో పైలట్ ప్రాజెక్టు మొదలైంది. సెప్టెంబర్ 4న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాధినిర్ధారణ పరీక్షలు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం సెపె్టంబర్ 28న జీఓ 606 ఇచ్చారు.
కుంభకోణం.. అలా మొదలైంది..
అనంతపురంలో మొదలైన పైలట్ ప్రాజెక్టు మూణ్నెల్లు కూడా పూర్తి కాకముందే.. అంతా బ్రహా్మండంగా జరిగిందని నివేదిక ఇచ్చారు. కమిటీ నివేదికకు ఆరు మాసాలు గడువు ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ తుంగలో తొక్కారు. ఓవైపు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లోనే సొంతంగా నిర్ధారణ పరీక్షలు చేసి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసుకుంటుండగా, ఏపీలో మాత్రం ప్రైవేటుకు అప్పజెప్పి భారీ స్కామ్‌కు తెరలేపారు.
ఒక్కో టెస్టుకు రూ.234
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 2016 జనవరి నుంచి ఔట్‌సోర్సింగ్‌కు రక్తపరీక్షల నిర్వహణ అప్పగించారు. ఇందులో 32 రకాల టెస్టులుంటాయి. ఒక టెస్టు చేసినా, అన్ని రకాల టెస్టులు చేసినా ఒక్క నమూనాకు రూ.234 ప్రకారం ప్రభుత్వం ‘మెడాల్’ సంస్థకు ఇవ్వాలి. దీంతో ‘మెడాల్’ పంట పండించుకుంది. కేవలం హిమోగ్లోబిన్, యూరిన్ పరీక్షలే లక్షల సంఖ్యలో చేసేవారు. దీనికి ఒక్కో పరీక్షకు బల్‌్కలో నాలుగు రూపాయలే అవుతుంది. ఇలా లక్షల టెస్టులు చేస్తే ఎంతవుతుందో అంచనా వేయొచ్చు.
నేడు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి..
ఒకప్పుడు ఒక్కో పీహెచ్‌సీలో రక్తపరీక్షల కోసం ప్రైవేటు కంపెనీకి సగటున నెలకు రూ.6 లక్షలు వ్యయం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రక్తపరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లోనే ఇప్పుడు మెడాల్ చేసిన వాటికంటే ఎక్కువ రక్త పరీక్షలు చేస్తున్నారు. పీహెచ్‌సీల్లో ల్యాబ్ టెక్నీíÙయన్లను నియమించింది. ప్రతినెలా పీహెచ్‌సీలో మెరుగైన వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఉచిత రక్తపరీక్షలు, సొంత ల్యా»ొరేటరీలు ఏర్పాటయ్యాయి. ప్రజారోగ్య వ్యవస్థ ఇప్పుడు ఏపీలో కేరళ, తమిళనాడులకు దీటుగా ఉందన్నది నీతి ఆయోగ్ లాంటి సంస్థలే చెబుతున్నాయి.
అప్పుడంతా అవినీతే
► ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల డాక్టర్లతో కుమ్మక్కయిన మెడాల్ ప్రతినిధులు యూరిన్, హిమోగ్లోబిన్, లేదా షుగర్ టెస్టులు వేల సంఖ్యలో రాయించుకునేవారు.
► ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఫ్రాంచైజీల పేరిట ప్రైవేటు ల్యాబ్‌లు అప్పగించారు.
► కొన్ని ఆస్పత్రుల్లో గర్భిణుల రక్తనమూనాలు సేకరించి టెస్టు చేయకుండానే ఫలితాలు ఇచ్చేవారు.
► రాష్ట్రంలో ఏటా 5వేలకు మించి మలేరియా కేసులు నమోదయ్యేవి కావు. అలాంటిది డబ్బు కోసం 2018లో 50 వేల మలేరియా కేసులకు టెస్టులు చేసినట్టు డ్యాష్‌బోర్డులో పొందుపరిచారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ దినపత్రిలో పతాక శీర్షికతో రాయగా డ్యాష్‌బోర్డులో ఉన్న మలేరియా టెస్టులు తొలగించి 6వేలకు కుదించారు.
► ఔట్‌సోర్సింగ్‌కు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నామన్న సాకుతో ఒక్క పీహెచ్‌సీలో గానీ, సీహెచ్‌సీలో గానీ ల్యాబ్ టెక్నీషియన్లను నియమించలేదు.
► మెడాల్ సంస్థ అప్పట్లో తెలుగుదేశం నేతలకు ఫ్రాంచైజీలు ఇచ్చినందుకు భారీగా ముడుపులు అందినట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment