వైరల్‌ : నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్‌ | Doctor Sings Nat King Cole Unforgettable Song For Baby To Pacify Her During Blood Test | Sakshi
Sakshi News home page

వైరల్‌ : నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్‌

Published Sun, Nov 10 2019 1:38 PM | Last Updated on Sun, Nov 10 2019 2:00 PM

Doctor Sings Nat King Cole Unforgettable Song For Baby To Pacify Her During Blood Test - Sakshi

సాధారణంగా చిన్న పిల్లలు సూదిని చూస్తేనే గజగజ వణికిపోతారు. అలాంటిది ఒక డాక్టర్‌ మాత్రం తన దగ్గరకు వచ్చిన చిన్నారికి మాత్రం  ఏ నొప్పి తెలియకుండా పాట పాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. షానన్‌ తన కూతురుకు రక్తపరీక్ష చేయించడానికి దగ్గర్లోని ఒక క్లినిక్‌కు  తీసుకెళ్లారు. అయితే చిన్నారిని పరీక్షించిన డాక్టర్ ర్యాన్ కోట్జీ రక్తం తీసేటప్పడు తనకు నొప్పి తెలియకుండా ఉండేందుకు ప్రముఖ పాప్‌ సింగర్‌ నాట్‌ కింగ్‌ కోల్స్‌  'అన్‌ఫర్‌గెటబుల్‌' పాటను పాడారు.

అయితే రక్త పరీక్ష నిర్వహిసున్న సమయంలో ఒక్క సెకను కూడా ఏడ్వకుండా డాక్టర్ పాడిన పాటను  చిన్నారి ఎంతో ఇష్టంగా వినడం ఆశ్చర్యం కలిగించింది . ఇదంతా గమనించిన చిన్నారి తల్లి షానన్ డాక్టర్‌ పాడిన పాటను వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ' డాక్టర్ ర్యాన్ కోట్జీ చేసిన పని నాకు ఆనందాన్ని కలిగించింది. నా బిడ్డకు నొప్పి తెలియకుండా పాట పాడిన డాక్టర్‌కు కృతజ్ఞతలు. రక్త పరీక్ష చేసేటప్పుడు తను ఏడుస్తుందేమోనని ఎంతో బయపడ్డా. కానీ డాక్టర్‌ వ్యవరించిన తీరు నన్ను ఆకట్టుకుంది' అంటూ ఆమె తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. షానన్‌ షేర్‌ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుంది. షేర్‌ చేసిన కాసేపటికే 43 వేల కామెంట్లు వచ్చాయి. చిన్నారికి నొప్పి తెలియకుండా డాక్టర్‌ కోట్జీ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement