హెపటైటిస్‌ టెన్షన్‌ ! | Hepatitis tension! | Sakshi
Sakshi News home page

హెపటైటిస్‌ టెన్షన్‌ !

Published Tue, Sep 5 2017 2:37 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

హెపటైటిస్‌ టెన్షన్‌ !

హెపటైటిస్‌ టెన్షన్‌ !

విజయవాడ నగరంలో హెపటైటిస్‌ విజృంభిస్తోంది. దీనివల్ల వందలాది మంది కామెర్లు, టైఫాయిడ్‌ వ్యాధుల బారినపడుతున్నారు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో విషజ్వరాలు వస్తాయి. ఈ ఏడాది మాత్రం వింత పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్‌ మొదటి వారం గడుస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గుముఖం పట్టలేదు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో అల్లాడుతూనే ఉన్నారు. మరోవైపు ప్రతి పది మంది జ్వరపీడితుల్లో ముగ్గురు కామెర్లు, టైఫాయిడ్‌ వ్యాధులతో బాధపడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా మారడం, కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు.   

లబ్బీపేట(విజయవాడ తూర్పు) : స్థానిక మొగల్రాజపురానికి చెందిన వెంకట్, సురేష్‌ అన్నాదమ్ములు. ఇరవై రోజుల కిందట వెంకట్‌కు జ్వరం రావడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. తొలుత మలేరియా నిర్ధారణ పరీక్ష చేయగా, నెగిటివ్‌ వచ్చింది. ఐదు రోజుల అనంతరం టైఫాయిడ్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. వెంకట్‌కు జ్వరం తగ్గిన మరో పది రోజులకు తమ్ముడు సురేష్‌కు కూడా జ్వరం వచ్చింది. అతనికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా, టైఫాయిడ్, జాండీస్‌(కామెర్లు) పాజిటివ్‌ వచ్చాయి.

ఇలా ఎంతో మంది టైఫాయిడ్, కామెర్ల వ్యా«ధుల బారిన పడున్నారు. ఇటీవల టైఫాయిడ్, కామెర్లుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సుమారు 80వేల మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, ఎక్కువ మంది విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో బాధపడుతున్నట్లు తేలింది. ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొంది.

పెరుగుతున్న జ్వరం కేసులు
సా«ధారణంగా వర్షాల కారణంగా జూలైలో దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. విషజ్వరాలు కూడా ప్రబలుతాయి. ఆగస్టు నెలాఖరుకు సాధారణ పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది మాత్రం విష జ్వరాలతోపాటు డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. సెప్టెంబర్‌ మొదటి వారం వచ్చినా... జ్వరం కేసులు ఎక్కువగానే నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ కేసులతోపాటు టైఫాయిడ్, కామెర్లు వ్యాధులు సోకుతున్న వారు పెరుగుతున్నారు.

వీరిలో ఎక్కువగా పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తొలుత రోగులు సాధారణ జ్వరంగా భావించి వైద్య నిపుణుల వద్దకు వెళ్లకుండా కేవలం మందులు వాడటం, అనుభవం లేని ఆర్‌ఎంపీలను ఆశ్రయించడంతో పరిస్థితి విషమిస్తున్నట్లు సీనియర్‌ డాక్టర్లు చెబుతున్నారు. కలుషిత నీరు, ఆహారం వల్ల కలిగే హెపటైటిస్‌ ఏ–వైరస్, ఈ–వైరస్‌ (ఫీకో వైరస్‌) కారణంగా వందలాది మంది కామెర్లు, టైఫాయిడ్‌ వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యులు తెలిపారు.

కామెర్ల వ్యాధి సోకడానికి కారణాలు..
♦  మలేరియా జ్వరం వచ్చిన వారికి, హెపటైటిస్‌ వైరస్‌ వల్ల పిత్తాశయంలో పసర కారణంగా కామెర్ల వ్యాధి సోకుతుంది.
♦  ఒక్కో సమయంలో క్షయ వ్యాధికి వాడే మందుల వల్ల కూడా కామెర్లు వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి.
♦    ప్రస్తుతం కలుషిత నీరు, ఆహారం కారణంగా హెపటైటిస్‌ ఏ–వైరస్, ఈ–వైరస్‌ (ఫీకో వైరస్‌)ల కారణంగా కామెర్లు సోకుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
♦   క్వాలిఫైడ్‌ వైద్యుల వద్దకు వెళ్లకపోవడం, సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకపోవడం, రక్తకణాలు త్వరగా చనిపోవడం వల్ల కామెర్లు సోకిన వారి పరిస్థితి విషమంగా మారుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement