హెపటైటిస్‌కు హోమియో మందులు | Hepatitis homeopathic drugs | Sakshi
Sakshi News home page

హెపటైటిస్‌కు హోమియో మందులు

Published Mon, Jul 21 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

హెపటైటిస్‌కు హోమియో మందులు

హెపటైటిస్‌కు హోమియో మందులు

1. జెల్సీమియమ్ 200: విపరీతమైన భయం, ఆందోళన కలవారికి; అక్యూట్ హెపటైటిస్ లక్షణాలు అంటే... నీరసం, ఆకలి మందగించడం, విరేచనాలు ఉన్నవారికి.
 
2. అకోనైట్ 200: హెపటైటిస్‌తో పాటు కళ్లు ఎర్రబారడం, చర్మం గులాబిరంగులోకి మారడం, మూత్రం ఎర్రగా మారడం, విపరీతమైన జ్వరం గలవారికి.
 
3. టారెన్‌టులా 200: సాలెపురుగు నుంచి ఈ మందు తయారు చేస్తారు. హెపటైటిస్ లక్షణాలతో పాటు ఉలిక్కిపడటం, అతిభయం, దాహం తక్కువగా ఉండటం, విపరీతమైన జ్వరం ఉన్నవారికి.
 
4. సిక్యూటా వీరోజా: చెట్ల నుంచి తయారు చేసే ఈ మందు మూర్చవ్యాధిని అణచివేయడం వల్ల వారికి వచ్చే జబ్బులకు పనిచేస్తుంది. ఇక జబ్బును పెద్దగా ఊహించుకుని ఆందోళన చెందేవారికీ మంచి మందు. దీన్ని 200 పొటెన్సీలో రెండుపూటలా ఉపయోగించాలి.
 
5. బ్రయోనియా: విపరీతమైన ఒళ్లునొప్పులు, గ్యాస్ అధికంగా ఉండటం, అధిక దాహం, ఆకలి మందగించడం; వ్యాపార లావాదేవీల గురించి ఎక్కువగా ఆలోచించడం చేసేవారికి.
 
క్రానిక్ హెపటైటిస్:


1. సల్ఫర్: శుభ్రత సరిగా పాటించనివారికి, చర్మవ్యాధులు అణచివేసిన తర్వాత జబ్బు వచ్చిన వారికి ఈ మందు డాక్టర్ పర్యవేక్షణలో 200 పొటెన్సీతో వాడాలి.
 
2. చెలిడోనియమ్: దీర్ఘకాలిక హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవారికి, కడుపులో ఉబ్బరంగా ఉండటం, అసైటిస్ (జలోదరం), కాళ్లవాపులు ఉన్నవారికి ఇది మంచి మందు.
 
3. లైకోపోడియమ్: జబ్బు గురించి ఎక్కువగా ఆందోళన చెందేవారికి ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. చిరాకు, కోపం ఉండటం; తీపి పదార్థాలను ఇష్టపడటం, దాహం తక్కువగా ఉండటం, త్వరగా ఏడ్చేసే స్వభావం ఉన్నవారికి, వేడిని తట్టుకోలేని వారికి ఇది బాగా పనిచేస్తుంది.
 
4. యాంటిమోనియమ్ క్రూడమ్: సున్నితమనస్కులు, ఊహాలోకంలో ఉండేవారికి ఇది బాగా పనిచేస్తుంది.
 
5. పల్సటిల్లా: తెలివైనవారికి, ఇంటిగురించి అధికంగా ఆలోచించేవారికి, శాంతస్వభావం గలవారికి త్వరగా ఏడ్చే స్వభావం ఉన్నవారికి ఇది మంచి మందు.
 
6. మెర్క్‌సాల్: అతిగా ఆహారం తీసుకోవడం, జబ్బును నిర్లక్ష్యం చేసేవారికి, అధిక చెమటలు, అధిక దాహం, చెడువాసన కలిగిన చెమట వచ్చేవారికి దీన్ని 200 పొటెన్సీలో నెలకు ఒక డోస్ ఇవ్వాలి.
 
7. నేట్రమ్‌మూర్: సున్నిత మనస్కులు, అసంతృప్తి భావన, ఉప్పు, పులుపు ఇష్టపడేవారికి బాగా పనిచేసే మందు.
 
8. చైనా: అసంతృప్తి, దురదృష్టజీవితం, చిరాకు, కోపం, మాటిమాటికీ మలేరియాతో బాధపడిన వాళ్లలో వచ్చిన హెపటైటిస్‌కు ఇది మంచి మందు.
 
హెపటైటిస్‌లో ఐదు రకాలు ఉంటాయి కాబట్టి వచ్చిన ఇన్ఫెక్షన్‌ను బట్టి, అతడి జబ్బు లక్షణాలు, వ్యక్తిగత స్వభావాలను పరిగణనలోకి తీసుకుని, గత వైద్యచరిత్రను కూడా పరిశీలించి మందు ఇవ్వాలి. చికిత్స చేసి, జబ్బునయం చేయడం కంటే రోగనిరోధకశక్తిని పెంపొందించడానికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.
 
 - డా. ఏ.ఎమ్. రెడ్డి, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement