మాజీ స్నేహితురాలిని వేధించిన కేసులో నిందితుడి అరెస్టు | Male Nurse Arrested For Online Harassment In Hyderabad | Sakshi
Sakshi News home page

మాజీ స్నేహితురాలిని వేధించిన కేసులో నిందితుడి అరెస్టు

Published Sat, Jun 29 2019 10:49 AM | Last Updated on Sat, Jun 29 2019 10:49 AM

Male Nurse Arrested For Online Harassment In Hyderabad - Sakshi

నిందితుడు గణేష్‌

సాక్షి, సిటీబ్యూరో: మాజీ స్నేహితురాలిని ఆన్‌లైన్‌లో వేధించిన కేసులో నిందితుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మేల్‌ నర్సుగా పని చేస్తున్న గణేష్‌ గతంలో కాచిగూడలోని ఆస్పత్రిలో పని చేశాడు.

అప్పట్లో పరిచయమైన సహోద్యోగినితో స్నేహం చేశాడు. ఆ సందర్భంలో కొన్ని ఫొటోలు సేకరించి భద్రపరుచుకున్నాడు. ఆపై ఇద్దరూ వేర్వేరు చోట్ల స్థిరపడిన తర్వాత ఆమెను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించిన అతను తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఆమె తిరస్కరించడంతో అభ్యంతరకరమైన ఫొటోలు పంపి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement